తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న బాలయ్య బాబుకి అఖండ సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా పూనకాలు తెప్పించేలా మాస్ ఊరమాస్ నట విశ్వరూపాన్ని చూపిస్తూ సత్తా చాటాడు బాలయ్య. ఈ సినిమా డిసెంబర్ 2న విడుదలై ప్రేక్షకుల ఎంతగానో ఆకట్టుకుంది. ఇక బోయపాటి - బాలకృష్ణ కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా అఖండ. ఈ సినిమాపై ఇండస్ట్రీలో, ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అంతేకాక.. బోయపాటి ఇప్పటికే రిలీజ్ చేసిన మూవీ అప్డేట్స్, టీజర్, ట్రైలర్ లు సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశాయి. ఈ సినిమాకి తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయిందని ప్రేక్షకులు చెబుతున్నారు. అంతేకాదు.. ఈ సినిమాలో బాలయ్య 'అఘెరా' పాత్ర అయితే సినిమాలో హైలెట్ అని అభిమానులు ప్రశంసిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో అదిరిపోయే సీన్స్, బాలయ్య డైలాగ్స్ చూస్తూ ఆయన ఫ్యాన్స్ థియేటర్స్ లో గోల పెట్టేస్తున్నారని అన్నారు.

ఈ సినిమాలో బోయపాటి టేకింగ్, బాలయ్య స్క్రీన్ ప్రజెన్స్ థ్రిల్లింగ్ గా ఉన్నాయని అంటున్నారు. అంతేకాదు.. ఈ యాక్షన్స్ ఎపిసోడ్స్ లో బాలయ్య నభూతో నభవిష్యతిలాగా కనిపించాడని చెబుతున్నారు. ఈ సినిమాలో ప్రతీ యాక్షన్ సన్నివేశం గూస్ బాంబ్స్  తెప్పించే విధంగా ఉందని చెబుతున్నారు. ఈ సినిమా సెకండ్ హాఫ్ లో కాస్త అక్కడక్కడ బోరింగ్ సీన్లు పడ్డాయని హీరోయిన్ లెంగ్త్ ఎక్కువైందని అభిప్రాయాలను వెల్లడించారు.

అయితే అఖండ మూవీ మల్టీప్లెక్స్ సినిమా కాదని.. బీ, సీ సెంటర్ ఆడియన్స్ ను అలరిస్తుందని కొందరు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ సినిమా మొత్తంగా విలన్ రోల్ లో శ్రీకాంత్ ఇరగదీశాడని.. బాలయ్య శివతాండవం చేస్తున్నాడని అంటున్నారు. ఇక ఈ సారి ప్రేక్షకులను అఖండ అలరించడం గ్యారెంటీ అని అభిప్రాయాలూ వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. మాస్ ఆడియెన్స్ పండుగ చేసుకునే సినిమా అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: