సమంత ప్రధాన క్యారెక్టర్ లో శ్రీదేవి మూవీస్ పతాకంపై కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమా టైటిల్ విషయానికి వస్తే.. యశోద గా చిత్రీకరించామని చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేశారు. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ ని సోమవారం రోజున పూజా కార్యక్రమాలతో మొదలైనట్లు తెలుస్తోంది. సమంత ఫ్యామిలీ మ్యాన్ వంటి వెబ్ సిరీస్ ల తో బాగా జాతీయస్థాయిలో గుర్తింపు పొందినది. ఇక అంతే కాకుండా కాస్త క్రేజ్ కూడా పెరిగిందని చెప్పవచ్చు. ఇక దీంతో ఈమె తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో సైతం మంచి పేరు ప్రఖ్యాతలు పొందినది.

ప్రస్తుతం సమంత కు ఉన్న క్రేజ్ తగ్గట్టుగా ఈ సినిమానే విభిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందిస్తున్నట్లు ఆ చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేశారు. ఈ సినిమాని తెలుగులోనే కాకుండా మిగతా నాలుగు భాషల్లో సైతం ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇదే సందర్భంలో నిర్మాత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ..సమంత ఈ మూవీలో ఒక మెయిన్ రోల్ గెటప్లో నటిస్తోంది. ముఖ్యంగా చెప్పాలనుకుంటే సినిమా లేడీ ఓరియంటెడ్ చిత్రం అని చెప్పవచ్చు అని తెలియజేశారు.

కృష్ణ ప్రసాద్ ఇదివరకే ఆదిత్య-369, సుధీర్ బాబుతో సమ్మోహనం, జెంటిల్ మాన్ వంటి సినిమాలకు కూడా నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఇప్పుడు సమంతా తో చేయడం చాలా ఆనందం వేస్తోంది అంటూ చెప్పుకొచ్చారు ఆయన. సమంత అభిమానులు కోరుకున్నట్లుగానే ఈ సినిమా ఉంటుందని తెలియజేశారు. ఇక ఈ రోజు నుంచి వరుసగా సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు ఆయన. వరుసగా నాలుగు నెలల పాటు షూటింగ్ ప్లాన్ చేశామని చెప్పుకొచ్చారు.
ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా మణిశర్మ అందిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో సమంతా నే కాకుండా ఇతర నటులు కూడా నటిస్తున్నట్లు తెలియజేశారు. ఈ సినిమాకి డైరెక్టర్ గా హరి తెరకెక్కిస్తున్నాడని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: