గత ఏడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వకీల్ సాబ్ రూపంలో భారీ విజయాన్ని అందించాడు దర్శకుడు వేణు శ్రీరామ్. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కి గట్టి కంబ్యాక్ ఇచ్చింది. దీంతో వకీల్ సాబ్ తర్వాత వేణు శ్రీరామ్ తో సినిమాలు చేయడానికి చాలా మంది హీరోలు ఆసక్తి చూపారు. అయినా కూడా ఇప్పటి వరకూ ఈ దర్శకుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయలేదు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు కాంపౌండ్ లో ఉండే డైరెక్టర్ దగ్గర ప్రస్తుతం కథలు ఉన్నా కూడా ఆ కథకు తగ్గ హీరోలు దొరకటం లేదని టాక్ వినిపిస్తోంది. అసలైతే వకీల్ సాబ్ తర్వాత వేణు శ్రీరామ్ అల్లు అర్జున్ తో ఐకాన్ అనే ప్రాజెక్టు చేయాల్సి ఉంది.

 గతంలోనే ఈ ప్రాజెక్టు సెట్ పైకి వెళ్లి మధ్యలోనే ఆగిపోయింది. అయితే వకీల్ సాబ్ తర్వాత ఈ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించే ప్రయత్నాలు చేశారు దిల్ రాజు. కానీ తాజాగా అల్లు అర్జున్ పుష్ప భారీ విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు బన్నీ ఫోకస్ అంతా పుష్ప పార్ట్ 2 పైనే ఉంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టుకోబోతోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు వేణు శ్రీరామ్ బన్నీ కోసం వెయిట్ చేయాల్సిందే. అయితే ఈలోగా వేరే హీరోతో సినిమా చేద్దామని అనుకున్న మిగతా హీరోలు ఎవరు ప్రస్తుతం ఖాళీగా లేకపోవడంతో ఏం చేయాలో తోచక అయోమయంలో పడ్డాడట ఈ దర్శకుడు.

 అయితే వకీల్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఈ దర్శకుడు ఖాళీగా ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే యువ హీరోలతో సినిమాలు చేసే ఆలోచన లేకనే స్టార్ హీరోల కోసం వెయిట్ చేస్తున్నాడట వేణు శ్రీరామ్. దీంతో తన నెక్ట్స్ ప్రాజెక్టు విషయంలో ఎటూ తేల్చుకోలేక పోతున్నాడట. ప్రస్తుతం ఈ దర్శకుడి దగ్గర ప్రభాస్, అల్లు అర్జున్ లకు సరిపోయే కథలు ఉన్నా ఈ హీరోలు దర్శకుడికి ఎప్పుడూ అవకాశం ఇస్తారనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగామారింది. మరి అప్పటిదాకా మరో హీరోతో అయినా వేణు శ్రీరామ్ సినిమా చేస్తాడా లేదా అనేది చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: