
అయితే నాయక్ సినిమా సక్సెస్ సాధించినా ఆ సినిమా అమలా పాల్ కెరీర్ కు పెద్దగా ప్లస్ కాలేదనే చెప్పాలి మరి. ఇక హీరోయిన్ అమలా పాల్ పలు వివాదాల ద్వారా కూడా వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. తాజాగా అమలా పాల్ చీర ధరించిన ఒక ఫోటో వైరల్ అవుతుండగా ఈ చీర ఖరీదు ఏకంగా 46000 రూపాయలు అని ఉంటుందని సమాచారం. అంతేకాదు.. సెకండ్ ఇన్నింగ్స్ లో గ్లామర్ రోల్స్ లో కంటే అభినయ ప్రధాన పాత్రల్లో అమలా పాల్ ఎక్కువగా కనిపిస్తున్నారు..
ఇక చీరలో అమలా పాల్ మెరిసిపోతున్నారు. ఆమె స్టైలిష్ గా ఉండటంతో పాటు కంఫర్ట్ గా ఉండే దుస్తులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అయితే ఈ స్టార్ హీరోయిన్ ఒక సందర్భంలో మాట్లాడుతూ కెరీర్ తొలినాళ్లలో స్కిన్ కలర్ విషయంలో కొంతమంది నుంచి నెగిటివ్ కామెంట్లు వినిపించడంతో తాను బాధ పడ్డానని అన్నారు. ప్రస్తుతం అమలా పాల్ చేతిలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్లు లేవు. ఇటీవల కాలంలో అమలా పాల్ నటించిన ఆమె సినిమాలో ప్రయోగాత్మక పాత్రలో నటించగా ఈ పాత్రకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు.