అందాల ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్, నితిన్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అ ఆ  సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో పాటు ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయిల అనుపమ పరమేశ్వరన్ చేసిన నటనకు కూడా తెలుగు ప్రజల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. ఇలా మొదటి సినిమాలో ఒక పల్లెటూరి అమ్మాయిల నటించి టాలీవుడ్ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత కాలంలో కూడా మంచి సంప్రదాయబద్ధమైన పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగించింది.

కెరియర్ ప్రారంభంలో ఈ ముద్దుగుమ్మకు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలు దక్కినప్పటికీ ఆ తర్వాత కాలంలో మాత్రం ఈ ముద్దుగుమ్మకు పెద్దగా విజయాలు దక్కలేదు. అయితే అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం 18 పేజిస్, కార్తికేయ టు , రౌడీ బాయ్స్ సినిమాలలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో రౌడీ బాయ్స్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమా విడుదల దగ్గర పడడంతో ఈ చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది. అయితే చిత్ర బృందం విడుదల చేసిన ఈ ట్రైలర్ లో అనుపమ పరమేశ్వరన్ లిప్ లాక్ సీన్ లతో రెచ్చిపోయింది. ఇది వరకు ఈ ముద్దుగుమ్మ చేసిన సినిమాలలో ఎప్పుడు కూడా ఈ రేంజ్ లో లిప్ లాక్  సన్నివేశాల్లో నటించలేదు. అయితే కేవలం ట్రైలర్ లోనే ఈ రేంజ్ లిప్ లాక్ సీన్స్ ఉంటే మరి సినిమాలో ఇంక ఏ రేంజ్ లో ఉంటాయో అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇలా కెరియర్ ప్రారంభంలో లిప్ లాక్ సీన్ లకు హాట్ సీన్ లకు దూరంగా ఉన్న అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం మాత్రం తన రూటు మార్చి లిప్ లాక్ సన్నివేశాలకు సిద్ధమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: