ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆహా అనే ఓటీటీ సంస్థను నిర్మించిన విషయం మనకు తెలిసిందే.. ఇకపోతే ఈ ఆహా ప్రేక్షకులను అలరించడానికి అలాగే మంచి టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన విషయం కూడా తెలిసిందే. సెలబ్రిటీ టాక్ షో లను మొదలుకొని డైరెక్ట్ గా కొన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమాలను కూడా విడుదల చేస్తూ ప్రేక్షకులకు మంచి ఆనందాన్ని ఇస్తూ వస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన భీమ్లా నాయక్ సినిమాని కూడా ఆహా ఓ టీ టీ  దక్కించుకున్నట్లు తాజా సమాచారం.

సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. దగ్గుబాటి రానా హీరోగా ఓ మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కిన  సినిమా భీమ్లా నాయక్.. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 25వ తేదీన తెలుగు అలాగే హిందీ లో ఏకకాలంలో విడుదల కాబోతున్న సమాచారం అందరికీ తెలిసిందే.. దీంతో అటు ప్రేక్షకులు ఇటు అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. ఈ సినిమాను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓ టీ టీ రైట్స్ ను దక్కించుకుంది అనే సమాచారం పెద్ద ఎత్తున ప్రచారం అయింది.. ఇప్పుడు మాత్రం ఆహా ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అంతే కాదు ఈ ఓటీటీ సంస్థలో ఇప్పటి వరకు జరగని అతి పెద్ద డీల్ ఈ సినిమా సొంతం చేసుకోవడం గమనార్హం. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది అని సినీ వర్గాలు చెబుతున్నాయి.. ఇప్పటి వరకు చిన్న చిన్న సినిమాలు.. వెబ్ సిరీస్ లు.. టాక్ షోలు విడుదల చేసిన ఆహ ఇప్పుడు ఏకంగా భారీ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది.. అంతేకాదు ఈ సినిమా కోసం భారీ స్థాయిలో కొన్ని కోట్ల రూపాయలను వెచ్చించినట్లు సమాచారం . ఈ సినిమాతో సబ్స్క్రైబర్లు పెంచుకోవడానికి ఇలా చేస్తోందని సమాచారం. ఇకపోతే ఇప్పటికే బాలయ్య బాబు హోస్ట్ గా చేసిన అన్ స్టాపబుల్ షో ద్వారా సబ్ స్క్రైబర్ లను సొంతం చేసుకుంది ఆహా.

మరింత సమాచారం తెలుసుకోండి: