ఇక అజిత్ నటించిన మొదటి పాన్ ఇండియా సినిమా 'వలీమై'…నిన్న అన్ని భాషలతో కలుపుకుని తెలుగులో కూడా విడుదలైంది. నిజానికి మొదట ఈ సినిమా ప్రోమోలు అవి చూసి మరో 'వివేకం' అవుతుందేమో అని కొందరు విమర్శించారు.పైగా తెలుగులో పవన్ కళ్యాణ్ సినిమాతో పోటీ పడి ఈ సినిమా రిలీజ్ కాబోతుండడంతో..'వలిమై' సినిమాని ఎవ్వరూ పట్టించుకోరేమో అని అంతా అనుకున్నారు. కానీ 'వలిమై' సినిమా మొదటి షోతోనే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు ఈ సినిమాలో బైక్ ఛేజింగ్ విజువల్స్ అనేవి హాలీవుడ్ సినిమాల లెవెల్ ని మ్యాచ్ చేసేలా తెరకెక్కాయి. టాలెంటెడ్ డైరెక్టర్ హెచ్. వినోద్ టేకింగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది.ఒక్క క్లాస్ ఆడియెన్స్ అని కాదు అన్ని వర్గాల ఆడియన్స్ ని కూడా అలరించే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి.
'ఆర్.ఎక్స్.100′ సినిమా తర్వాత హిట్టు మొహం చూడని టాలీవుడ్ హీరో కార్తికేయ గుమ్మకొండ కి కూడా ఈ సినిమా మంచి ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.ఇక అసలు విషయానికి వస్తే.. ఇది అందరికి తెలిసిన విషయమే.. మాములుగా తమిళనాడులో అజిత్ సినిమాలు యావరేజ్ గా ఉంటేనే కలెక్షన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. అలాంటిది పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఇంకా రేంజ్ లో వసూళ్లు వస్తాయో చెప్పనవసరం లేదు. మిగతా చోట్ల వసూళ్లు ఎలా వున్నా అజిత్ కి ఒక్క తమిళనాడు చాలు.. ఫస్ట్ డే ఈ సినిమా తమిళనాడులో వసూళ్ల సునామినే సృష్టించింది.ఈ సినిమాకు 34.27 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఈ రకమైన మొదటి రోజు వసూళ్లు తమిళనాడులో ఏ సినిమాకి రాలేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి