
అసలు విషయంలోకి వెళితే అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించడం తో ఈ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బాగా పాపులర్ అయింది అని చెప్పవచ్చు.. అందుచేతనే ఈ సినిమాకు సంబంధించి సీక్వెల్ కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నారు. ఇక మహేష్ బాబు తో కూడా సర్కారు వారి పాట సినిమాను కూడా ఈ బ్యానర్ పైనే చిత్రీకరిస్తున్నారు.. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన లిరికల్ వీడియో సాంగ్ ఓ రేంజ్ లో ప్రేక్షకులను అభిమానులను ఆకట్టుకుంది. ఇక వీటితోపాటుగా నానితో కలిసి" అంటే సుందరానికి" అనే సినిమాను కూడా నిర్మిస్తున్నారు.
ఇక ఆ తర్వాత హీరో సుధీర్ బాబు, కృతి శెట్టి తో డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ నిర్మిస్తున్న సినిమాను కూడా ఈ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.. ఇక వీటితోపాటుగా బాలకృష్ణ సినిమా, వాల్తేర్ వీరయ్య మరి కొన్ని సినిమాలను కూడా ఈ బ్యానర్ పైన చిత్రీకరిస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తో కూడా ఒక సినిమాని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.. అది కూడా దాదాపుగా 9 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఇలాంటి సాహసం చేయడం అనేది పెద్ద రిస్క్ అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.