ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన `పుష్ప ది రైజ్` సినిమా దేశ వ్యాప్తంగా సంచలనాలు సృష్టించింది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ బన్నీ మేకర్స్ కూడా ఊహించని విధంగా ఈ సినిమా నార్త్ లో వసూళ్ల వర్షం కురిపించింది. దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాదిలో ఈ మూవీ సింహ గర్జన చేసిందని స్పష్టంగా చెప్పొచ్చు. అంతగా ఈ సినిమా అక్కడ వసూళ్లని రాబట్టింది.ఏకంగా అక్కడ 100 కోట్లకు పైగా వసూళ్లని రాబట్టడం బాలీవుడ్ వర్గాలని షాక్ కు గురిచేసింది. ఎలాంటి ప్రమోషన్స్ చేయని ఈ సినిమాకి ఈ రేంజ్ వసూళ్లేంటీ సామీ అని అంతా అవాక్కయ్యారు. దీని పై బాలీవుడ్ లో ఇప్పటికీ ఈ సినిమా గురించి పెద్ద చర్చే జరుగుతోంది. హిందీ సినిమాల రిలీజ్ ల సమయంలో అక్కడి మీడియా బాలీవుడ్ స్టార్స్ ని మేకర్స్ ని పదే పదే `పుష్ప`సినిమా సాధించిన కలెక్షన్ ల గురించి ప్రశ్నిస్తూ ఇరిటేట్ చేస్తున్నారు. ఇదిలా వుంటే తాజా పరిస్థితుల్ని పుష్ప ది రైజ్ కి దక్కిన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని మేకర్స్ `పుష్ప ది రూల్` సినిమా విషయంలో బాలీవుడ్ పై ప్రత్యేక దృష్టిని పెట్టారట.


ఇక దీని కోసం ఏకంగా టాలీవుడ్ మెగా ప్రొడ్యూసర్ మాస్టర్ మైండ్ అల్లు అరవింద్ ని రంగంలోకి దించేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.ఫస్ట్ పార్ట్ పెద్ద హిట్ అవ్వడంతో సెకండ్ పార్ట్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక ఆ అంచనాలని దృష్టిలో పెట్టుకుని అందుకు అనుగుణంగా పుష్ప పార్ట్ 2లో డైరెక్టర్ సుకుమార్ మార్పులు చేస్తున్నారని బాలీవుడ్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని కొత్త పాత్రలని కూడా యాడ్ చేసి బాలీవుడ్ నటులని ఓ క్రేజీ హీరోయిన్ ని తీసుకోబోతున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.ఇక ఈ సినిమా బాలీవుడ్ మార్కెట్ బాధ్యతల్ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కి అప్పగిస్తున్నారట. బడ్జెట్ ప్లాన్ లతో పాటు బాలీవుడ్ లో ఈ సినిమాని ఎవరి ద్వారా రిలీజ్ చేయాలి వంటి విషయాల్ని దగ్గరుండి ఆయనే చూసుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: