ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ అవెయిటింగ్ మూవీ ఏదైనా ఉంది అంటే అది "ఆర్ ఆర్ ఆర్" అని ఎటువంటి సందేహం లేకుండా చెప్పవచ్చు. టాలీవుడ్ బడా డైరెక్టర్ రాజమౌళి బాహుబలి సీరీస్ తర్వాత ఈ సినిమాను ప్రకటించారు. అప్పటి నుండి ఈ సినిమా నుండి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ ప్రేక్షకులను మరియు ఎన్టీఆర్ రామ్ చరణ్ అభిమానులకు ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఈ సినిమా షూటింగ్ గత సంవత్సరమే పూర్తయింది మరియు అప్పుడే దసరా కానుకగా విడుదల చేయాలని చిత్ర బృందం ప్రణాళికలు చేయగా, కరోనా కారణంగా థియేటర్ లు మూతపడడం, ఆ తర్వాత తెరుచుకున్నా ప్రజల్లో కరోనా భయంతో వస్తారా రారా అన్న కారణాలతో సినిమా రిలీజ్ వాయిదా పడింది.

అయితే ఆ తర్వాత నుండి మంచి రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తూ వచ్చారు. అలా మార్చ్ 25 , 2022 న రిలీజ్ చేయడానికి నిర్ణయం తీసుకుంది రాజమౌళి అండ్ టీమ్. ఈ వార్త తెలిసిన ఆర్ ఆర్ ఆర్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక సరిగ్గా ఈ సినిమా రిలీజ్ కు 10 రోజులు మాత్రమే సమయం ఉంది. అందుకే ప్రమోషన్స్ ను భారీగా ప్లాన్ చేస్తున్నారు. రిలీజ్ కు ముందు రెండు భారీ ప్రి రిలీజ్ ఈవెంట్ లను జరపనున్నారు అని తెలుస్తోంది.  కాగా ఈ మూవీ గురించి ఒక రహస్యాన్ని డైరెక్టర్ రాజమౌళి తాజాగా బయట పెట్టారు. ఈ సినిమా నిండా స్టార్ నటీనటులు ఉండడం, పాన్ ఇండియా స్థాయి చిత్రం కావడం, యాక్షన్ అంశాలు పుష్కలంగా ఉండడం వంటి పలు కారణాల చేత ఇది భారీ బడ్జెట్ మూవీ అని తెలిసిందే.

కానీ ఈ సినిమాకు ఎంత బడ్జెట్ అయి ఉంటుందని చాలా మందికి సందేహాలు ఉన్నాయి. అలాంటి వారి ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇచ్చారు. రాజమౌళిసినిమా బడ్జెట్ గురించి మాట్లాడుతూ, ఆర్ ఆర్ ఆర్ నిర్మాణానికి 550 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని అందరికీ షాక్ ఇచ్చారు. మామూలుగా ఇప్పటి వరకు తెలిసిన వార్తల ప్రకారం ఈ సినిమాకు 400 కోట్ల బడ్జెట్ మాత్రమే అనుకున్నాము. ఇప్పటికే బిజినెస్స్ ద్వారా చాలా వరకు వెనక్కు వచ్చేసిందట... మిగిలిన బడ్జెట్ కూడా సినిమా విడుదలతో వచ్చేస్తుందని నమ్మకంతో ఉన్నామని ఆయన తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: