‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల తేదీ దగ్గరపడుతున్నకొద్ది రామ్ చరణ్ జూనియర్ అభిమానులలో జోష్ పెరిగిపోతుంటే తెలుగు రాష్ట్రాలలోని ధియేటర్ యజమానులకు మాత్రం విపరీతంగా టెన్షన్ పెరిగిపోతోంది అని టాక్. దీనికి కారణం ‘ఆర్ ఆర్ ఆర్’ లో చరణ్ జూనియర్ లు కలిసి నటించడంతో ఆసినిమాకు మొదటి మూడురోజులు వచ్చే వీరాభిమానుల తాకిడితే తమ ధియేటర్లు ఏమైపోతాయి అన్నభయం చాలామంది ధియేటర్ యజమానులకు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.


సాధారణంగా టాప్ హీరోల సినిమాల మొదటిరోజు మొదటి షో ఒక జాతరను తలపిస్తుంది. అభిమానులు తమ హీరోని చూడగానే పూనకం వచ్చినట్లు ఊగిపోతూ ధియేటర్స్ స్క్రీన్ వైపు పువ్వులు కాగితాలు విసరడమే కాకుండా ధియేటర్ లోని సిల్వర్ స్క్రీన్ దగ్గరకు వచ్చి డాన్స్ లు చేస్తూ ఉంటారు. ఈ పూనకంలో ఏదైనా తేడాలు వస్తే వీరాభిమానులు అసహనానికిలోని ధియేటర్ లోని సిల్వర్ స్క్రీన్ పాడుచేసిన సందర్భాలు కూడ గతంలో చాల ఉన్నాయి.


‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో చరణ్ జూనియర్ లు నటిస్తూ ఉండటంతో తమ హీరోనే  గొప్పవాడు అంటూ రెచ్చగొట్టే కామెంట్స్ చరణ్ జూనియర్ అభిమానులు ఒకరి పై ఒకరు చేసుకునే ప్రమాదం ఉంది అన్నసంకేతాలు వస్తున్నాయి. దీనితో ఎలర్ట్ అయిన ధియేటర్ యజమానులు తమ ధియేటర్ లోని సిల్వర్ స్క్రీన్ రక్షణ కోసం అభిమానులు సిల్వర్ స్క్రీన్ దరిదాపుకు రాకుండా మేకులు పెట్టడమే కాకుండా చిన్నపాటి ఫెన్సింగ్ కూడ ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.



ఇది ఇలా ఉంటే ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రమోషన్ లో జూనియర్ చూపెడుతున్న వాక్ చాతుర్యం ముందు రామ్ చరణ్ తేలిపోయాడు అంటూ వస్తున్న కామెంట్స్ విని చరణ్ అభిమానులు అసహనానికి గురవుతున్నారు. ముఖ్యంగా ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకి సంబంధించి హిందీ వర్షన్ అలాగే కన్నడ వర్షన్ కు సంబంధించి డైలాగ్స్ కూడ జూనియర్ తన సొంత గొంతుతో చాల అద్భుతంగా చెపితే ఈవిషయంలో చరణ్ వెనకపడ్డాడు అన్న కామెంట్స్ కూడ అప్పుడే మొదలైపోయాయి. ఈవిషయాలు అన్నీ ధియేటర్ యజమానుల దృష్టికి రావడంతో ధియేటర్ ల బయట కటవౌట్స్ దగ్గర నుండి ప్రతి చిన్నవిషయంలోను చరణ్ జూనియర్ అభిమానుల మధ్య రగడ ఏర్పడుతుందా అన్నభయాలు ధియేటర్ యజమానులను వెంటాడుతున్నట్లు తెలుస్తోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: