ప్రేక్షకులు ఆర్ ఆర్ ఆర్ సినిమాకు బాగా బ్రహ్మరథం పడుతూ వసూళ్ల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే బాహుబలి సినిమా రికార్డుల్ని తొలి రోజు అధిగమించిన ఆర్ ఆర్ ఆర్ హిందీ వెర్షన్ ఉత్తరాదిలో కూడా బాహుబలి రికార్డుల్ని అధిగమించి 200 కోట్ల మార్కుకి చేరబోతోంది. దీంతో ఇప్పడు ఎక్కడా విన్నా ఆర్ ఆర్ ఆర్ రికార్డుల మోతే ప్రధానంగా వినిపిస్తూ దేశ వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇదిలా వుంటే ఈ సినిమా కలెక్షన్ లపై హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు.ఆర్ ఆర్ ఆర్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో ఓ బాలీవుడ్ మీడియాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చిన ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా కలెక్షన్ లపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సినిమా కలెక్షన్ ల పై మీ ఒపీనియన్ ఏంటని అడిగిన ప్రశ్నకు జూనియర్ ఎన్టీఆర్ చాలా ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.



ముందు నా ప్రాధాన్యత ప్రేక్షకుల నుంచి సినిమాకు ఎలాంటి స్పందన అనేది లభిస్తోంది. క్రిటిక్స్ ఎలా రియాక్ట్ అయ్యారు? అనే విషయాలని మాత్రమే తాను ముందు పరిగణలోకి తీసుకుంటానని ఆ తరువాతే సినిమా కలెక్షన్ ల గురించి ఆలోచిస్తానని ఆయన స్పష్టం చేశారు.ఈ సినిమా సాధించే కలెక్షన్ నంబర్స్ నా డిపార్ట్ మెంట్ కాదు. భారీ స్థాయిలో ఈ సినిమా వసూళ్లని కనుక రాబడితే మా నమ్మకానికి మరింత ప్రోత్సాహాన్నిస్తుంది అంతే` అని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తరువాత టాలీవుడ్ క్లాస్ స్టార్ డైరెక్టర్ అయిన కొరటాల శివ డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించనున్న 30వ సినిమా ఇది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ నెల నుంచి ప్రారంభం కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: