ఈ మధ్య సినిమాలు అన్నీ ఓటిటిలో విడుదల అవుతున్న సంగతి తెలిసిందే..థియెటర్లలో విడుదల కానీ సినిమాలు అన్నీ కూడా ఇలానే విడుదల అవుతూ భారీ సక్సెస్ ను అనుకున్నాయి..స్టార్ హిరొల సినిమాలు కూడా ఇలానే హిట్ ను అందుకుంటున్నాయి. థియెటర్లలో విడుదల అయ్యి భారీ సక్సెస్ అయిన సినిమాలు కూడా ఇలానే మళ్ళీ విడుదల అవుతూ సక్సెస్ ను అందుకోవడం విశేషం. వారం వారం ఓటిటిలో విడుదల అవుతున్న సినిమాల తో అభిమానులకు జాతర అనే చెప్పాలి.ఇంట్లోనే కూర్చోని అభిమాన హీరోల సినిమాను చూడవచ్చు.


అలాగే ఈ వారం కూడా ఓటిటిలో ఈ వారం సినిమాల జాతర మొదలైంది..థియేటర్లలో ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, ఆచార్య హవా నడుస్తుండగా.. బిగ్ స్క్రీన్ లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలతో పాటు వెబ్ సిరీస్, హాలీవుడ్ సినిమాలు ఓటీటీలోకి రాబోతున్నాయి.ఓటీటీలో ఈ వారం కూడా గ్రాండ్ కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. ఓటీటీలలో విడుదల అవుతున్న సినిమాపై ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుండడంతో అందుకు తగ్గట్టుగానే సంస్థలు ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో దూసుకొస్తున్నాయి.


ఇకపొతే ఈ వారం ఓటిటిలో రాబోతున్న సినిమాల గురించి ఒకసారి చుద్దాము..సేవేజ్‌ బ్యూటీ(వెబ్‌ సిరీస్‌) మే12వ తేదీ నుంచి నెట్‌ ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్‌ కానుంది. తాలెదండ (కన్నడ) మే 13వ తేదీ నుంచి, ముగిలిపేట్‌ (కన్నడ) మే 13వ తేదీ నుంచి జీ5లో స్ట్రీమింగ్‌ కానుంది. ది మ్యాట్రిక్స్‌ రెసరెక్షన్స్‌ (తెలుగు డబ్బింగ్‌) మే12వ తేదీ నుంచి, మోడర్న్‌ లవ్‌ ముంబై (హిందీ సిరీస్రిమే 13వ తేదీ నుంచి, వుషు (మలయాళం) మే13వ తేదీ నుంచి అమెజాన్‌ ప్రేమ్‌ లో స్ట్రీమింగ్‌ కానుంది.స్నికరెల్లా (హాలీవుడ్‌ ) మే 13వ తేదీ నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌ లో స్ట్రీమింగ్‌ కానుంది. కుతుకు పత్తు (తమిళం) మే 13 వ తేదీ నుంచి ఆహాలో స్ట్రీమింగ్‌ కానుంది. దా ఇష్క్‌(హిందీ సిరీస్‌) మే12వ తేదీ నుంచి వూట్‌ లో స్ట్రీమింగ్‌ కానుంది.. మొత్తానికి ఈ వారం సినిమాల జాతర కాస్త ఎక్కువగానే ఉందని తెలుస్తుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: