కమల్ హాసన్ విక్రమ్ సినిమా చేసి దాన్ని ఇటీవలే విడుదల చేశాడు. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. తెలుగు తమిళ భాషల్లో కమల్ నటనకు అందరు ఫిదా అయ్యారు. అంతేకాదు కమర్షియల్ గా కూడా ఈ సినిమా అందరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అలా విక్రమ్ సినిమా తో కమల్ హాసన్ మంచి విజయాన్ని అందుకోగా శంకర్ కూడా రామ్ చరణ్ తో కలిసి ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేశాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతుంది.
వచ్చే ఏడాది సంక్రాంతి కి ఈ సినిమా ను విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఆ తర్వాత కూడా శంకర్ బాలీవుడ్ లో రణవీర్ సింగ్ తో కలిసి అపరిచితుడు సినిమా రీమేక్ ను చేయబోతున్నాడు. అలా అయన భారతీయుడు సినిమా పూర్తిగా పక్కన పెట్టగా కమల్ మధ్య లో ఈ సినిమా తిరిగి మొదలుపెట్టడానికి గట్టి ప్రయత్నాలు చేశాడు. కానీ కుదరలేదు. కానీ మరో తమిళ హీరో, ముఖ్యమంత్రి కుమారుడు అయినా ఉదయనిధి స్టాలిన్ ఈ సినిమా మొదలుపెట్టేవిధంగా ప్రయత్నాలు చేస్తున్నాడట. మరి అయన రంగంలో దిగిన ఈ సినిమా ను మొదలుపెట్టడానికి పెద్దగా సమయం పట్టదు అనే చెప్పాలి. ఏదేమైనా శంకర్ రామ్ చరణ్ సినిమా తర్వాతే ఆ సినిమా చేయబోతున్నాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి