టాలీవుడ్  ఇండస్ట్రీ లో ఉన్న యంగ్ టాలెంటెడ్ దర్శకులలో ఒకరు అయిన తరుణ్ భాస్కర్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . తరుణ్ భాస్కర్ తన కెరియర్ ను పెళ్లి చూపులు సినిమా తో మొదలు పెట్టాడు . చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన పెళ్లి చూపులు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా ప్రేక్షకుల నుండి విమర్శకుల నుండి ప్రశంసలు అందుకొని గొప్ప చిత్రం గా నిలిచింది . 

అలా మొదటి సినిమా తోనే ఎన్నో గొప్ప గొప్ప ప్రశంసలను అందుకున్న తరుణ్ భాస్కర్ ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది  సినిమా కు దర్శకత్వం వహించాడు . ఈ సినిమా లో తరుణ్ భాస్కర్ నలుగురు స్నేహితుల మధ్య చిన్న చిన్న భావోద్వేగాలతో కూడిన కథ ను సినిమాగా తెరకెక్కించి ,  మంచి కామెడీ మరియు మంచి భావోద్వేగాలను ఉండేలా సినిమాను తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నాడు . ఇలా వరుసగా రెండు విజయాలు అందుకున్న తరుణ్ భాస్కర్ ఆ తర్వాత అనేక సినిమా ల్లో నటించినప్పటికీ  ఎ సినిమాకు దర్శకత్వం వహించే లేదు . ఇది ఇలా ఉంటే తాజా గా తరుణ్ భాస్కర్  తదుపరి సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడింది .  తరుణ్ భాస్కర్ తన తదుపరి సినిమా క్రైమ్ కామెడీ నేపథ్యం లో తెరకెక్కించ నున్నాడు .

అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా చిత్ర బృందం విడుదల చేసింది . తరుణ్ భాస్కర్ తన తదుపరి సినిమా గా 'కీడ కోలా' అనే సినిమా కు దర్శకత్వం వహించబో తున్నాడు . ఇందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా చిత్ర బృందం విడుదల చేసింది .

మరింత సమాచారం తెలుసుకోండి: