
ఓ సైంటిస్ట్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నంబి నారాయణన్ పాత్రలో మాధవన్ నటించారు. కరోనా పాండమిక్ నడుమ నలిగిపోతు జులై 1న ఈ సినిమా విడుదల కానుంది.
దర్శకుడిగా మొదటి సారి ట్రై చేస్తున్న మాధవన్ సక్సెస్ అందుకోవాలని కోరుకుందాం. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని టీం చెబుతున్నారు.
ఈ సినిమాపై అందరిలోనూ మంచి అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే చరిత్రలోనే ఇది ఒక వింత కథ. చేయని తప్పుకు ఒక శాస్త్రవేత్త జైలు జీవితం గడుపుతాడు. ఈ పాయింట్ అందరికీ కనెక్ట్ అవుతుంది. కానీ మాధవన్ దర్శకుడిగా స్క్రీన్ ప్లే ఎలా చేశాడు ఆనంది ఇక్కడ ముఖ్యం. కాసేపటి క్రితమే విడుదలైన ట్రైలర్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. మరి ఈ అంచనాలు అన్నీ అందుకుని సక్సెస్ అవుతుందా లేదా అన్నది చూడాలి అంటే... మరో వరం రోజుల్లో ఇది థియేటర్ లో విడుదల కానుంది.