‘బాహుబలి’ సినిమా విడుదల అయ్యేంతవరకు తెలుగు సినిమా గురించి పెద్దగా బాలీవుడ్ జనాలు పెద్దగా పట్టించుకోలేదు. ఒక్కసారి ఇలా పెను ఉప్పెన లా వచ్చిన ‘బాహుబలి’ కి వచ్చిన కలక్షన్స్ ను చూసి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపడటమే కాకుండా రాజమౌళి తన సినిమా ప్రమోషన్ లో అనుసరించిన కొత్త టెక్నిక్ బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు షాక్ అయ్యాయి.


‘బాహుబలి’ విడుదల చేసే సమయంలో రాజమౌళి తన యూనిట్ తో కలిసి కేవలం ముంబాయి మాత్రమే కాకుండా ఢిల్లీ ఆహమదాబాద్ శ్రీనగర్ కలకత్తా కటక్ లాంటి అనేక ప్రముఖ నగరాలలో సుడిగాలి పర్యటన చేసి తన మూవీ గురించి ఉత్తరాది ప్రేక్షకులకు తెలిసేలా చేసాడు. ఇదే టెక్నిక్ ‘ఆర్ ఆర్ ఆర్’ విషయంలో కూడ అనుసరించడంతో ఈమూవీకి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కలక్షన్స్ మాత్రం 12 వందల కోట్ల స్థాయిని దాటాయి.


ఇప్పుడు ఇదే టెక్నిక్ రణబీర్ కపూర్ తన ‘బ్రహ్మాస్త్ర’ మూవీ విషయంలో చేస్తున్నాడు. ఈమూవీ ట్రైలర్ ను విశాఖపట్నంలో విడుదల చేసి ఈమూవీ గురించి తెలుగు ప్రేక్షకులు చాల ఎక్కువగా మాట్లాడుకునేలా చేసాడు. అంతేకాదు సెప్టెంబర్ లో విడుదల కాబోతున్న ఈమూవీకి సంబంధించిన ప్రమోషన్స్ ను దక్షిణాదిలో ప్రముఖ నగరాలు అయిన హైదరాబాద్ చెన్నై బెంగుళూరు లలో నిర్వహిస్తూ దక్షిణాది సినిమా రంగంలో ప్రముఖ స్థానంలో ఉన్న చిరంజీవి కమలహాసన్ మోహన్ లాల్ లాంటి స్టార్స్ ను ‘బ్రహ్మాస్త్ర’ మూవీ ప్రమోషన్ కు వాడుకుంటున్నారు.


ఇప్పుడు ఇదే పంధాను అనుసరిస్తూ కన్నడ హీరో సుధీప్ కూడ తన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘విక్రాంత్ రాణా’ మూవీ ప్రమోషన్ ను హైదరాబాద్ నుండి ప్రారంభించి అక్కడ తన మూవీ ట్రైలర్ విడుదల చేసాడు. మళయాళంలో టాప్ హీరోగా గుర్తింపు పొందిన పృధ్వీరాజ్ తన లేటెస్ట్ మూవీ ‘కడువ’ మూవీ ప్రమోషన్ ను హైదరాబాద్ నుంచి ప్రారంభించితన మార్కెట్ ను తెలుగు రాష్ట్రాలలో కూడ బాగా పెంచుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: