టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా మల్టీస్టారర్ గా తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా RRR. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతటి భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే.ప్రపంచవ్యాప్తంగా కూడా దాదాపు 1100 కోట్ల పైగా కలెక్షన్లని సాధించింది ఈ సినిమా. మన దేశంలోనే కాక విదేశాల్లో కూడా ఈ సినిమాకి జనాలు ఫుల్ గా ఫిదా అయిపోయారు. ఇక rrr సినిమా ఓటీటీలో విడుదల అయ్యాక కనీ వినీ ఎరుగని రీతిలో మరింత పేరు సంపాదించింది. విదేశీ ప్రేక్షకులకి ఈ సినిమా ఐతే తెగ నచ్చేసింది. వివిధ దేశాల్లోని ప్రేక్షకులతో పాటు హాలీవుడ్ సినీ పరిశ్రమని కూడా rrr సినిమా బాగా మెప్పించింది. పలువురు హాలీవుడ్ రచయితలు ఇంకా అలాగే టెక్నీషియన్స్ rrr సినిమాని పొగుడుతూ ట్విట్టర్ లో సినిమా గురించి ట్వీట్స్ చేశారు.


ఇక తాజాగా rrr సినిమా మరోసారి బాగా వైరల్ అవుతుంది. ఈ సినిమాలో ఒక ట్రక్కులో పులులు, ఎలుగుబంట్లు, జింకలు ఇంకా అలాగే నక్కలతో తారక్‌ ఇచ్చే వైల్డ్‌ ఎంట్రీ సీన్‌ అయితే అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో అందరికి తెలిసిందే. ఈ సీన్ చూసి థియేటర్లో ప్రేక్షకులు అంతా కూడా దెబ్బకు ఆశ్చర్యపోయారు. ఓ విదేశీ ప్రేక్షకుడు అయితే ఈ సీన్‌ వీడియోను ట్విటర్‌లో షేర్ చేసి.. 'నేను ఇక ఇప్పటిదాకా ఎన్నో సినిమాలు చూశాను. 29 మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ సినిమాలు కూడా ఎన్నో సార్లు చూశాను. కానీ ఇప్పటివరకు కూడా ఇలాంటి అద్భుతమైన ఎంట్రీ సీన్ ఏ సినిమాలో చూడలేదు' అని అతడు పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి మరింతమంది దీనిపై ట్వీట్స్ చేశారు. అతి తక్కువ సమయంలో ట్విట్టర్లో ఈ వీడియో ఏకంగా 12 మిలియన్‌ వ్యూస్‌ను సాధించింది. ఇక గత రెండు రోజుల నుంచి ఈ వీడియో, ఎన్టీఆర్ పేరు, rrr ట్విట్టర్లో బాగా మారుమ్రోగిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: