టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు  అయిన గోపీచంద్ తాజాగా పక్కా కమర్షియల్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో గోపీచంద్ సరసన రాశి కన్నా హీరోయిన్ గా నటించగా , మారుతిమూవీ కి దర్శకత్వం వహించాడు.

మూవీ లో రావు రమేష్ , సత్యరాజ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ జులై 1 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర కాస్త నెగటివ్ టాక్ రావడంతో ఈ మూవీ కి చిత్ర యూనిట్ ఆశించిన రేంజ్ లో కలెక్షన్ లు దక్కలేదు. దానితో చివరగా పక్కా కమర్షియల్ మూవీ కి బాక్సా ఫీస్ దగ్గర నష్టాలే మిగిలాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదలకు ముందు ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో పక్కా కమర్షియల్ మూవీ పై గోపీచంద్ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉండటం వల్ల ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 15.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దానితో ఈ మూవీ 16 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ టోటల్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 8.81 కోట్ల షేర్ , 15.30 కోట్ల గ్లాస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది. దీనితో పక్కా కమర్షియల్ మూవీ బాక్సా ఫీస్ దగ్గర 7.19 కోట్ల నష్టాలను చవిచూసింది. ఇలా గోపీచంద్ తాజాగా నటించిన పక్కా కమర్షియల్ మూవీ బాక్సా ఫీస్ దగ్గర నష్టాలను ఎదుర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: