ఇక గత కొద్ది రోజుల నుంచి బాలకృష్ణకు అలాగే నందమూరి హీరోలైన ఎన్టీఆర్ ఇంకా కళ్యాణ్ రామ్ కి మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వైరల్ అవుతున్నాయి.అంతేకాదు అందుకు తగ్గట్టుగానే ఎక్కడ కూడా బాలయ్య.. హరికృష్ణ కొడుకులను అసలు ప్రస్తావించింది లేదు.. ఇంకా అలాగే బింబిసారా ఈవెంట్ లో కూడా బాలకృష్ణ గురించి ఎన్టీఆర్ ఇంకా కళ్యాణ్ రామ్ కూడా సంబోధించింది లేదు. దీన్ని బట్టి చూస్తే అనేక సందేశాలు కూడా రెండు కుటుంబాల మధ్య గొడవలు ఉన్నాయని వార్తలు బాగా వైరల్ అయ్యాయి. కానీ ఎట్టకేలకు బాలకృష్ణ బింబిసార సినిమాపై స్పందించి అటు కళ్యాణ్ రామ్ ఇంకా ఎన్టీఆర్ కి తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని వెల్లడించారు.ప్రముఖ డైరెక్టర్ వశిష్ఠని మెచ్చుకుంటూ  సినిమా బాగా చేశావు.. త్వరలో మనం కూడా సినిమా చేద్దాం.. నీలాంటి యంగ్ స్టర్స్ ఖచ్చితంగా కావాలి.. నువ్వు మెల్లిమెల్లిగా కాకుండా మొదటిసారి ఇంత పెద్ద సినిమా బాగా చేశావు.. ఇంతటి మంచి అవకాశం ఇవ్వడం మా నందమూరి వంశానికే చెల్లింది అంటూ తమ వారసులను తెగ పొగిడేశారు బాలయ్య. ఇకపోతే తాజాగా నందమూరి కుటుంబ సభ్యులంతా సినిమా చూడడానికి రావడం కూడా జరిగింది.


బాలకృష్ణ ఇంకా మోక్షజ్ఞ తో పాటు అందరూ వచ్చి సినిమా చూసి సినిమా యూనిట్ పై ప్రశంసల వర్షం కురిపించారు.సినిమా చూసిన తర్వాత బాలకృష్ణ, కళ్యాణ్ రామ్ ని బాగా అభినందించడం జరిగింది. ఇక మీడియాతో బాలకృష్ణ మాట్లాడుతూ.. ఇలాంటి మంచి సినిమాలు అనేవి ఇంకా ఇవ్వాలి.. అన్నయ్య హరికృష్ణ దీవెనలు ఇంకా బాబాయిగా నా దీవెనలు నీకు ఎప్పుడూ ఉంటాయని కళ్యాణ్ రామ్ ఉద్దేశించి అన్నారు. మా నందమూరి వంశస్థులు ఎప్పుడూ కూడా కొత్త వాళ్ళని ఇంకా టాలెంటెడ్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. ప్రేక్షకులు ఇలాంటి మంచి సినిమాలు చూడడానికి బాగా ఇష్టపడతారు. ఇక మా నాన్నగారు అప్పట్లోనే ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు తీశారు. ఇందులో మంచి సందేశం కూడా ఉంది అని అందరినీ అభినందించారు. సినిమా చూసి బాలకృష్ణ అభినందించడం బాగా వైరల్ గా మారింది. దీంతో వీరి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు కూడా తొలగిపోయాయని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: