మోస్ట్ గ్లామరస్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి ప్రియాంక అరుల్ మోహన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రియాంక అరుల్ మోహన్ ఇప్పటికే తెలుగు లో నాని హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో  తెరకెక్కిన నానిస్ గ్యాంగ్ లీడర్ మూవీ లో హీరోయిన్ గా నటించింది. అలాగే శర్వానంద్ హీరోగా తెరకెక్కిన శ్రీకారం మూవీ లో కూడా హీరోయిన్ గా నటించింది. కాకపోతే ఈ ముద్దు గుమ్మ తెలుగు లో నటించిన ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయాయి.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ తమిళ సినిమా ఇండస్ట్రీ లో మాత్రం వరస విజయాలను అందుకుంటూ ఫుల్ స్పీడ్ లో దూసుకుపోతుంది. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కిన డాక్టర్ మూవీ లో హీరోయిన్ గా నటించి ఈ మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. అలాగే శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కిన డాన్ మూవీ లో కూడా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీతో కూడా ప్రియాంక అరుల్ మోహన్ అద్భుతమైన విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.

ఇలా తమిళ ఇండస్ట్రీ లో వరుస విజయాలతో ఫుల్ స్పీడ్ లి దూసుకుపోతున్న ఈ ముద్దు గుమ్మ తాజాగా మరో క్రేజీ తమిళ సినిమాలో కూడా అవకాశాన్ని దక్కించుకుంది. ధనుష్ హీరోగా అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తిరక్కబోయే కెప్టెన్ మిల్లర్ మూవీలో ప్రియాంక అరుణ్ మోహన్ ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీ యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది  ఇలా ప్రియాంక అరుల్ మోహన్ తమిళ సినిమా ఇండస్ట్రీ లో ఫుల్ స్పీడ్ లో దూసుకుపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: