‘గోపాల గోపాల’ మూవీలో వెంకటేష్ నాస్థికుడు గా కనిపిస్తే పవన్ కళ్యాణ్ భగవంతుడు గా వచ్చి వెంకీ కి జ్ఞానోదయం కలిగిస్తాడు. అయితే ఇప్పుడు వెంకటేష్ ఏకంగా భగవంతుడు గా మారుతూ వచ్చేనెల రాబోతున్న దీపావళికి ధియేటర్లలో భగవంతుడు గా కనిపించబోతున్నాడు.  


ఒక మళయాళ మూవీ ఆధారంగా నిర్మింపబడుతున్న ఈ మూవీలో తెలుగు నేటివిటీ ప్రకారం కథలో అనేక మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. ఆశ్వథ్ మరిముత్తు అనే మళయాళ దర్శకుడు ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. విష్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో వెంకటేష్ ది కీలక పాత్ర.  


వెంకటేష్ పెద్దగా పూజలు చేస్తూ గుడులు చుట్టూ తిరగడు కాని తెలుగులో ఇంగ్లీష్ లో లేటెస్ట్ గా వచ్చే ప్రతి ఆధ్యాత్మిక పుస్తకాన్ని వెంకీ కి చదివే అలవాటు ఉంది అంటారు. ఆయన ఇంటిలో కొన్ని వందల ఆధ్యాత్మిక పుస్తకాల లైబ్రరరీ ఉంది అని అంటారు. గతంలో ఈసినిమాలు వదిలిపెట్టి హిమాలయా లకు వెళ్ళిపోవాలనే ఆలోచన కూడ వెంకీకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి అని అంటారు. స్వామీ వివేకానంద పుస్తకాలను విపరీతంగా చదివే అలవాటు ఉన్న వెంకటేష్ కు తన జీవితంలో ఎవరైనా తీస్తే స్వామీ వివేకానంద గా నటించాలని ఒక తీరని కోరిక ఉంది.


పవన్ వెంకటేష్ లు కలిస్తే చాలు వారిద్దరూ ఒకరికొకరు తాము ఈమధ్య చదివిన ఆధ్యాత్మిక పుస్తకాలు ఒకరికొకరు ఇచ్చుకుంటూ ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారని వారి సన్నిహితులు చెపుతూ ఉంటారు. ఇలాంటి ఆధ్యాత్మిక పిపాస కలిగిన వెంకటేష్ దేవుడు పాత్రలో ఎలా నటించాడు అన్న ఆశక్తి అందరిలోనూ ఉంటుంది. వెంకటేష్ తాను నటించే 75 వ సినిమా కథ గురించి అనేకమంది దర్శకులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తన కెరియర్ లో ల్యాండ్ మార్క్ మూవీగా అందరికీ చిరకాలం గుర్తుండిపోయే కథ గురించి వెంకీ అన్వేషణ కొనసాగుతోంది అని అంటున్నారు..
మరింత సమాచారం తెలుసుకోండి: