నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి చాలా కాలం తర్వాత ఒకే రోజు బాక్సా ఫీస్ వద్ద పోటీ పడబో తున్నారు. చిరంజీవి టైటిల్ రోల్ పోషిం చిన గాడ్ ఫాదర్, నాగార్జున ప్రధాన పాత్ర లో నటించి న ది ఘోస్ట్ అక్టోబర్ 5న థియేటర్ల లో గ్రాండ్‌ గా విడుదల కాబోతున్నాయి.
అక్కినేని నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి కేవలం స్టార్ హీరోలు మాత్రమే కాదు మంచి స్నేహితు లు కూడా అని ప్రత్యే కించి చెప్పన వసరం లేదు. ఈ ఇద్దరూ చాలా కాలం తర్వాత ఒకే రోజు బాక్సా ఫీస్ వద్ద పోటీ పడబో తున్నారు. చిరంజీవి టైటిల్ రోల్ పోషించి న గాడ్ ఫాదర్, నాగార్జున ప్రధాన పాత్ర లో నటించి న ది ఘోస్ట్ అక్టోబర్ 5న థియేటర్ల లో గ్రాండ్‌ గా విడుదల కాబోతున్నాయి.

ఈ నేపథ్యం లో ఇప్పటి కే నాగ్, చిరు తమ టీంతో ప్రమోషన్స్ పనిలో బిజీ  గా ఉన్నారు. నాగార్జున ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్‌-6  హోస్ట్‌ గా వ్యహరిస్తున్నాడని తెలిసిందే. చిరంజీవి గాడ్ ఫాదర్ నుంచి రిలీజైన థార్ మార్ థక్కర్ మార్ నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. ఇపుడి దే పాటకు నాగార్జున స్టెప్పేలేశాడు. బిగ్ బాస్ తాజా ఎపిసోడ్‌ లో డ్యాన్సర్ల తో కలిసి స్టెప్పులేసిన ప్రోమో ఒకటి ఇపుడు ఆన్‌లైన్‌ లో హల్ చల్ చేస్తోంది.

పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌ లో వస్తున్న గాడ్ ఫాదర్ చిత్రాన్ని మోహన్ రాజా డైరెక్ట్ చేస్తుండ గా..ఈ సినిమా పై అంచనాలు భారీ గానే ఉన్నాయి. మరోవైపు ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ది ఘోస్ట్ పై కూడా అంచనా లు ఎక్కువే ఉన్నాయి. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లు రాబడతా యన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: