బుల్లితెర యాంకర్ ప్రదీప్ కు ప్రేక్షకుల్లో ఉన్న్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. గతంతో పోల్చి చూస్తే ప్రదీప్ హోస్ట్ చేసే షోల సంఖ్య తగ్గినా ప్రదీప్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
ప్రదీప్ పెళ్లి గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ప్రచారంలోకి వచ్చాయి. వైరల్ అయిన వార్తలను నిజమేనని చాలామంది నమ్మారు. అయితే తాజాగా తన పెళ్లి గురించి, పెళ్లిపై వైరల్ అయిన వార్తల గురించి ప్రదీప్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు ప్రదీప్ కు పెళ్లి అయిపోయిందని వార్తలు ప్రచారం చేయగా వార్తలు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారంలోకి వచ్చాయి. ప్రదీప్ తనపై ప్రచారంలోకి వచ్చిన వార్తల గురించి స్పందిస్తూ ఇప్పటికే నాకు నాలుగైదు సార్లు పెళ్లి అయిపోయిందని కామెంట్లు చేశారు. నా పెళ్లి గురించి యూట్యూబ్ లో చూడ లేదా నువ్వు అంటూ ప్రదీప్ తనపై తాను సెటైర్లు వేసుకోవడం గమనార్హం. నీ ఊతపదం ఏంటనే ప్రశ్నకు నీ యంకమ్మ అని సమాధానం ఇచ్చారు..
ప్రదీప్ మాచిరాజు వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవు తున్నాయి. ప్రదీప్ పెళ్లికి సంబంధించిన శుభవార్త ఎప్పుడు చెబుతారో చూడాల్సి ఉంది. ప్రదీప్ కు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది. ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలో నటించగా ఆ సినిమా యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. ప్రదీప్ హీరో గా కెరీర్ ను కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
సినిమాసినిమాకు ప్రదీప్ రేంజ్ పెరుగుతుండగా ప్రదీప్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రదీప్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. అమ్మాయిల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ప్రదీప్ పెళ్లి చేసుకుంటారో లేదో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: