ఇండియన్ సినిమా గర్వించదగ్గ చిత్రాల లో డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమా ఒకటని చెప్పవచ్చు. ఈ చిత్రం నిన్నటి రోజున ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. ఇక ఈ సినిమా ట్రైలర్, టీజర్ లను బాగా అలరించాయని చెప్పవచ్చు. ఇక దీంతో ఈ సినిమాని రూ.500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా నిర్మించబోతున్నారు. ఈ చిత్రంలో విక్రమ్, కార్తీ, ఐశ్వర్యరాయ్ ,త్రిష, జయం రవి తదితర నటీనటులు నటించారు. అయితే ఈ చిత్రం తెలుగు లో పర్వాలేదనిపించుకున్నప్పటికీ ఈ సినిమా తెలుగు లో సక్సెస్ కావాలంటే ఎన్ని కోట్లు రాబట్టాలి ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.

1). నైజాం-2.20 కోట్ల రూపాయలు
2). సిడెడ్ -1.85 కోట్ల రూపాయలు
3). ఉత్తరాంధ్ర-1.10 కోట్ల రూపాయలు.
4). ఈస్ట్ -36 లక్షలు.
5). వెస్ట్ -32 లక్షలు.
6). గుంటూరు-60 లక్షలు.
7). కృష్ణ-75 లక్షలు
8). నెల్లూరు-30 లక్షలు.
9). ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం బిజినెస్ విషయానికి వస్తే రూ.8.48 కోట్ల రూపాయలు.

పొన్నియన్ సెల్వన్ -1 సినిమా తెలుగు రాష్ట్రాలలోని థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తె.. రూ.8.48 కోట్ల రూపాయలు జరగగా ఈ సినిమా సక్సెస్ కావాలి రూ.9 కోట రూపాయలు రాబట్టాల్సి ఉంటుంది. ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్ పర్వాలేదు అనిపించుకున్నప్పటికీ ఆ తర్వాత  పాజిటివ్ టాక్ ను మాత్రం సంపాదించుకోలేక పోయింది అనే వార్తలు వినిపిస్తున్నాయి.


ఇక ఈ చిత్రంలోని నటీనటులలో అద్భుతమైన నటను ప్రదర్శించినప్పటికీ. కేవలం ఈ సినిమా లో కార్తీ నటన మాత్రమే బాగుందని ప్రేక్షకులు తెలియజేస్తున్నారు. అయితే ఈ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతుందని మౌత్ టాకు వినిపిస్తోంది. మరి దీంతో ఈ సినిమా సీక్వెల్ కూడా ఉంటుందా లేదా అని అనుమానాలు ప్రేక్షకులలో ఒక ప్రశ్న మదలుతోంది.మరి ఏమవుతుందనే విషయం చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: