తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయిన మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే మంచు విష్ణు ఆఖరుగా మోసగాళ్లు అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. 

మూవీ లో కాజల్ అగర్వాల్ ఒక కీలక పాత్రలో నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన మోసగాళ్లు మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. ఇది ఇలా ఉంటే మోసగాళ్లు మూవీ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న మంచు విష్ణు తాజాగా జిన్నా అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో సన్నీ లియోన్ , పాయల్ రాజ్ పుత్ మంచు విష్ణు సరసన హీరోయిన్ లుగా నటించారు. 

మూవీ కి సూర్య దర్శకత్వం వహించాడు. జి.నాగేశ్వర్ రెడ్డిమూవీ కి కథ ను అందించిన ,  ఈ మూవీ కి కోన వెంకట్ స్క్రిప్టు అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని అక్టోబర్ 21 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా జిన్నా మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ను విడుదల చేసింది. తాచాగా జిన్నా మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించింది. అక్టోబర్ 5 వ తేదీన ఈ మూవీ ట్రైలర్ ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ లో మంచు విష్ణు అదిరిపోయే బాడీతో ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: