సంక్రాంతి సీజన్ తెలుగు సినిమా పరిశ్రమలో చాలా మందికి ఎంతో ప్రియమైనది. నిర్మాతలు అయితే ఆ సీజన్ లో తమ సినిమాలను విడుదల చేయాలని ఎంతో బలంగా కోరుతూ ఉంటారు. ఆ విధంగా ఈ సంక్రాంతి సీజన్ పై అందరూ దృష్టి పడింది. చాలామంది తమ సినిమాలను సంక్రాంతికి విడుదల చేయాలని రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పెద్ద హీరోలే భారీ స్థాయిలో తమ సినిమాలను విడుదల చేయడానికి పోటీ పడుతూ ఉండడం విశేషం.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాను అలాగే నందమూరి బాలకృష్ణ 107వ సినిమాను ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆది పురుష్ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ ముగ్గురు మాత్రమే కాకుండా తమిళ అగ్ర హీరో విజయ్ దళపతి హీరో గా నటిస్తున్న వారసుడు చిత్రాన్ని కూడా సంక్రాంతి కానుక గానే ప్రేక్షకులు ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో ఇంత మంది పెద్ద హీరోల సినిమాలు ఒకే సీజన్ లో అందులోనూ కొద్దీ రోజుల వ్యవధిలో విడుదల అవ్వడం సినిమా పరిశ్రమకు అంత మంచిది కాదని కొంతమంది సినిమా పెద్దలు చెబుతున్నారు.
ఈ నాలుగు సినిమాలు కాదు అన్నట్లుగా అక్కినేని అఖిల్ కూడా తన సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో రెండు సినిమాలను వెనక్కి తగ్గించేలా చేయాలని సినిమా పెద్దలు భావిస్తున్నారట అందులో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాను వాయిదా వేయాలని వారు కోరుతున్నారట ఇప్పటికే దసరా కానుకగా చిరంజీవి నటించిన సినిమా విడుదల అయింది కాబట్టి ఇంకొక పండుగ సీజన్ చిరంజీవికి కేటాయించాలి అంటే కష్టం అవుతుంది అని వారు చెబుతున్నారు. బాలకృష్ణ సినిమా సంక్రాంతికి తప్పకుండా వస్తుందని చెప్పవచ్చు. ప్రభాస్ ఆది పురుష్ కూడా సంక్రాంతికి ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఒకవేళ వాగ్దేవి సినిమా విడుదల కాకపోతే అఖిల్ సినిమా తప్పకుండా సంక్రాంతి వస్తుందని చెప్పవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి