సినీ పరిశ్రమలో మహిళలు లైంగిక వేధింపలకు గురవుతుంటారని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. తమ కోర్కె తీర్చాలంటూ కొందరు వేధించారని ఇప్పటికే పలువురు నటీమణులు బహిరంగంగా తెలిపారు. ‘మీ టూ’ ఉద్యమం ద్వారా ఇండస్ట్రీలో తమకు ఎదురైన లైంగిక వేధింపులకు గురించి ఒక్కొక్కరుగా బయట పెడుతున్నారు. ఈ క్రమంలో పలువురు నిర్మాతలు, హీరోలపై నటీమణులు ఆరోపణలు చేశారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నిర్మాత సాజిద్ ఖాన్ పై ప్రముఖ బాలీవుడ్, మోడల్ షెర్లిన్ సంచలన ఆరోపణలు చేసింది. సాజిద్ తనపై లైంగిక వేధింపులకు,బెదిరింపులకు పాల్పడినట్లు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే 2005 లో జరినట్లు ఆమె ఆరోపణలపై తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఏఎన్ఐ కి ఇచ్చిన ఇంటర్యూలో షెర్లిన్ మాట్లాడుతూ..” 2005లో సాజిద్ ఖాన్ నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డు. కానీ అప్పట్లో ఇండస్ట్రీలో చాలా పలుకబడి కలిగిన వ్యక్తిగా సాజిద్ ఖాన్ చలమణి అవుతుండటంతో ఫిర్యాదు చేసే ధైర్యం చేయలేకపోయాను. ఇటీవల వచ్చిన మీటూ ఉద్యమం ఇచ్చిన ధైర్యంతో తాజాగా సాజిద్ ఖాన్ పై ఫిర్యాదు చేశాను. నన్ను లైంగికగా, మానసికంగా వేధించిన సాజిద్ ఖాన్ లో జైలులో పెట్టాలి” అంటూ షెర్లిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇక ఆమె మాట్లాడుతూ..”ఫిర్యాదు సమయంలో ఈ ఘటన ఎప్పుడు జరిగింది అంటూ పోలీసులు అడిగారు. దీంతో ఈ ఘటనలు 2005లో జరిగిందని చెప్పాను. దీనిపై తమను ఆశ్రయించడానికి ఇంతకాలం సమయం ఎందుకు పట్టిందని నన్ను ప్రశ్నించారు.ఇప్పుడు మీరు బయటకు రావడానికి గల ప్రధాన ఉద్దేశ్యం ఏమిటని పోలీసుల అడిగారు. అప్పట్లో సాజిద్ ఖాన్ పై లైంగిక వేధింపుల కేసు పెట్టేంత ధైర్యం నాకు లేదని చెప్పాను. సాజిద్ ఖాన్ బాధిత మహిళలతో ఎలా ప్రవర్తించాడన్నది.. అతడి మీడియా ఇంటర్యూలు, సోషల్ మీడియాను చూస్తే అర్ధమవుతుంది. కొందరిని శృంగారం గురించి అతడు అడుగుతాడు. రోజుకు ఎన్ని సార్లు కావాలి, ఎంత మంది బాయ్ ఫ్రెండ్స్ అంటూ ప్రశ్నించాడు. అతడు తన ప్రైవేటు పార్ట్ లను చూపించి, నన్ను పట్టుకోమన్నాడు” అని షెర్లిన్ ఆరోపించింది.సాజిద్ ఖాన్ పై లైంగిక వేధింపులు ఫిర్యాదులు రావడం ఇదేం మొదటి సారి కాదు. మీ టూ ఉద్యమం బాగా ఉన్న రోజుల్లోనే సాజిద్ ఖాన్ పై బాలీవుడ్ కి చెందిన పలువురు హీరోయిన్లు, మోడల్స్ వరుస పెట్టి ఆరోపణలు చేశారు. 9 మంది ఆర్టిస్టులు అతడిపై లైంగిక వేధింపుల కేసులు పెట్టారు. సాజిద్ ఖాన్ పై ఆరోపణలు చేసిన వాళ్లంతా గతంలో అతడితో కలిసి సినిమాల్లో, టీవీ షోల్లో, వివిధ ప్రాజెక్టుల్లో కలిసి పనిచేసిన వాళ్లే కావడం గమనార్హం. ఇలా మొత్తంగా సాజిద్ ఖాన్ పై లైంగిక వేధింపుల కేసులకు లెక్కేలేదు

మరింత సమాచారం తెలుసుకోండి: