ముఖ్యంగా తమిళ్ లో కమల్ హాసన్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవడంతో పాటు.. అల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ సినిమా. ఇక ఈ మూవీకి సిక్వల్ ఉండే అవకాశం ఉందని ఆ మద్య దర్శకుడు లోకేశ్ స్వయంగా ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఖైదీ, విక్రమ్ సినిమాలను ఇంటర్నల్ గా కనెక్ట్ చేసిన లోకేశ్.. ఇదే కోవలో తొమ్మిది పార్ట్ లు ఉండబోతున్నాయని గతంలోనే హింట్ ఇచ్చారు.
ఇక నెక్స్ట్ విజయ్ తలపతి తో మూవీ చేస్తున్న ఈ ధర్శకుడు.. ఆ తరువాత " ఖైధి 2 " తెరకెక్కించే అవకాశం ఉంది అంటా మరీ. ఈ మూవీలో తరువాత విక్రమ్ సిక్వల్ సిద్దం చేస్తాడట. అయితే విక్రమ్ సిక్వల్ కు సంబంధించి ఓ వార్త తమిళ్ సినీ సర్కిల్స్ లో బాగా వైరల్ అవుతోంది. ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ రోల్ చేసే అవకాశం కూడా ఉందట. గత కొంత కాలంగా రామ్ చరణ్, లోకేశ్ కనకరాజ్ కాంబినేషన్ పై రకరకాల వార్తలు వస్తున్న సంగతి కూడా తెలిసిందే. విక్రమ్ మూవీలో క్లైమాక్స్ లో వచ్చే సూర్య రోలెక్స్ పాత్ర ఆ మూవీకే హైలెట్ గా నిలిచింది. అలాగే విక్రమ్ సిక్వల్ లో కూడా రామ్ చరణ్ తో అదిరిపోయే పాత్రను డిజైన్ చేశాడట దర్శకుడు లోకేశ్. అయితే ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికి తమిళ్ సినీ సర్కిల్స్ లో మాత్రం ఈ న్యూస్ బాగా వైరల్ అవుతోంది. మరి దీనిపై స్పష్టత రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడక తప్పదు మరీ.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి