సూపర్ స్టార్ కృష్ణ మరణించి రోజులు గడిచినా కృష్ణ మరణం గురించి ఇంకా తెలుగు ప్రజలు మాట్లాడుకుంటూనే ఉన్నారు. కృష్ణ చనిపోయిన దగ్గర నుండి ఆయన అంతిమయాత్ర వరకు ఛానల్స్ ప్రసారం చేసిన లైవ్ టెలికాస్ట్ లకు హైఎస్ట్ రేటింగ్స్ రావడం చూస్తే కృష్ణ పై తెలుగు ప్రజలకు అంత అభిమానం ఇప్పటికీ ఆ స్థాయిలో ఉందా అని చాలామంది ఆశ్చర్యపోయారు.


కృష్ణ మరణించిన తరువాత మహేష్ కు సానుభూతి తెలపడానికి వచ్చిన కొందరి ప్రముఖులు కృష్ణ స్మారకార్థం ఒక మెమోరియల్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని సూచనలు ఇవ్వడంతో ఆ సూచన గురించి సూపర్ కృష్ణ కుటుంబ సభ్యులు లోతుగా ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. స్మారక చిహ్నం అంటే కృష్ణ శిలా విగ్రహం కాకుండా ఒక ప్రాముఖ్యత గల ప్రదేశంలా మార్చి జనం అక్కడకు వచ్చి చూసేలా కృష్ణ మెమోరియల్ ఉంటే బాగుంటుంది అన్న సలహాలు కూడ కృష్ణ కుటుంబానికి వస్తున్నట్లు టాక్.




ఈ మెమోరియల్ లో కృష్ణ సినిమాలకు సంబంధించిన అవార్డులు షీల్డ్స్ అలాగే కృష్ణ నటించిన 350 సినిమాలలోని అతడి పాత్రలకు సంబంధించిన లైవ్ సైజ్ ఫోటోలు ప్రదర్శనగా పెడితే కృష్ణ ఖ్యాతి కలకాలం జనం గుర్తుంచుకుంటారని కృష్ణ కుటుంబ సభ్యులకు సూచనలు వస్తున్నట్లు టాక్. గతంలో ఇలాంటి మెమోరియల్ అక్కినేని నాగేశ్వరావు పేరిట అన్నపూర్ణ స్టూడియోస్ లో పెడితే బాగుంటుంది అన్న సూచనలు కూడ వచ్చిన విషయం తెలిసిందే.


సాధారణంగా టాప్ సెలెబ్రెటీలు చనిపోయిన తరువాత వారి దహన కార్యక్రమాలు వారికి సంబంధించిన ఫామ్ హౌస్ లో నిర్వహించి అక్కడ ఒక సమాధి కడుతూ ఉంటారు. అయితే కృష్ణ అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరగడంతో అక్కడ ఆయన పేరున సమాధి కట్టే అవకాశం ఉండడు. దీనితో కృష్ణ మెమోరియల్ ఆలోచనలు వాస్తవ రూపం దాల్చి పద్మాలయ స్టూడియోస్ లో కృష్ణ మెమోరియల్ ఆలోచనలు వాస్తవ రూపానికి వస్తాయేమో రానున్న కాలం తెలియచేస్తుంది..



మరింత సమాచారం తెలుసుకోండి: