
ఇక హౌస్ లో శ్రీహాన్ ఆట తీరుపై సిరి ఏమనుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. శ్రీహాన్ ఆట పై సిరి సంతోషంగానే ఉంది. అతను కహ్చ్చితంగా టాప్ 2లో ఉంటాడని అంటుంది. అయితే శ్రీ సత్యతో చేస్తున్న అతే కొద్దిగా నచ్చట్లేదని అంటుందట. అదికూడా తము సీజన్ 5 లో షణ్ముఖ్ కి క్లోజ్ గా ఉన్నానని తను ఇప్పుడు శ్రీ సత్యకి క్లోజ్ అవుతున్నాడని అంటుంది. ఇక ఆట పరంగా శ్రీహాన్ ఓకే అనిపించుకుంటున్నా కొన్ని విషయాల్లో శ్రీ సత్యకి సపోర్ట్ చేస్తూ హౌస్ మెట్స్ కి దూరమవుతున్నాడు. శ్రీహాన్ పర్ఫెక్ట్ గేం ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాడా లేదా అన్నది తెలియట్లేదు. కీర్తి భట్ తో అతను అనవసరంగా గొడవ పడుతున్నాడని అంటున్నారు.
హౌస్ లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టంట్ అయిన శ్రీహాన్ ఒక లేడీ కంటెస్టంట్ అది కూడా ఆమెకి ఏమాత్రం హెల్త్ బాగా లేని టైం లో ఆమె ని ఎగతాళి చేయడం.. ఆమె మీద కామెడీ చేయడం లాంటివి కొద్దిగా అతి అనిపిస్తున్నాయి. ఇక రేవంత్, శ్రె స్త్యలతో మాత్రమే శ్రీహాన్ క్లోజ్ గా ఉంటూ మిగతా వారిని దూరం చేసుకుంటున్నాడని తెలుస్తుంది. టాప్ 5 వరకు వస్తాడు కానీ శ్రీహాన్ టైటిల్ రేసులో ఉంటాడా లేదా అన్నది మాత్రం డౌటే అంటున్నారు. ప్రస్తుతం ఆడుతున్నట్టు ఆడితే మాత్రం అతను టాప్ 2 లో కష్టమే అని చెప్పొచ్చు.