తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరో లలో ఒకరు అయినటు వంటి నాగ చైతన్య ఈ మధ్య వరుస మూవీ లతో ప్రేక్షకులను పలకరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిం.దే అందులో భాగంగా ఈ సంవత్సరం ప్రారంభం లో సంక్రాంతి కానుకగా విడుదల అయిన బంగార్రాజు మూవీ లో నాగ చైతన్య ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ ద్వారా నాగ చైతన్య హిట్ ను అందుకున్నాడు. ఆ తరువాత థాంక్యూ , లాల్ సింగ్ చడ్డ మూవీ లలో నటించాడు. ఈ మూవీ లలో థాంక్యూ మూవీ లో నాగ చైతన్య సోలో హీరో గా నటించాడు.

విక్రమ్ కె కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన థాంక్యూ మూవీ లో రాసి కన్నా , నాగ చైతన్య సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయింది. కాకపోతే ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర కాస్త నెగటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో థాంక్యూ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్ లు దక్కలేదు. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయిన థాంక్యూ మూవీ కొన్ని రోజుల క్రితమే బుల్లి తెర ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ సాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ సంస్థలలో ఒకటి అయినటు వంటి జెమినీ టీవీ సంస్థ దక్కించుకుంది.

తాజాగా జెమినీ టీవీ సంస్థ ఈ మూవీ ని ప్రసారం చేసింది. థాంక్యూ మూవీ మొదటి సారి బుల్లి తెర పై ప్రసారం అయినప్పుడు 3.21 "టి ఆర్ పి" ని సొంతం చేసుకుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయినా థాంక్యూ మూవీ బుల్లి తెర పై ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది అని చెప్పవచ్చు.  నాగ చైతన్య ప్రస్తుతం దూత అనే వెబ్ సిరీస్ లోను కస్టడీ అనే మూవీ లోనూ నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: