హిందీ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయినటు వంటి అక్షయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అక్షయ్ కుమార్ ఇప్పటికే ఈ సంవత్సరం రక్షా బంధన్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా అక్షయ్ కుమార్ "రామ్‌ సేతు" అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. నాజర్‌ , సత్యదేవ్‌ ,  జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ , నుస్రత్‌ బరూచా తదితరులు ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించగా , అభిషేక్‌ శర్మ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడం తో ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. 

అలా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ 25 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో మూవీ యూనిట్ విడుదల చేసింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ "ఓ టి టి" హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుంది. ఇది ఇలా ఉంటే అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఈ మూవీ ని ఫ్రీగా కాకుండా రెంట్ బేస్డ్ పద్ధతిలో అందుబాటులోకి తీసుకువచ్చింది. 199 రూపాయలు చెల్లించినట్లయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమాను చూడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: