మొన్నీమధ్య కార్తికేయ సీక్వెల్ తో పాన్ ఇండియా హిట్ అందుకున్న హీరో నిఖిల్ సిద్దార్థ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం 18పేజిస్. ఈ సినిమా కు పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించగా ఆయన శిష్యుడు “కుమారి 21ఎఫ్” చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు..ఈ సినిమాలో నిఖిల్ పక్కన హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. ఇటీవలే ఈ చిత్ర టీజర్, “నన్నయ్య రాసిన” అనే పాటకు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.


ఈ మేరకు 18పేజిస్ చిత్రం నుండి తమిళ స్టార్ హీరో శింబు పాడిన “టైం ఇవ్వు పిల్ల కొంచెం టైం ఇవ్వు” అనే పాటను విడుదల చేసారు. ప్రతీ ఒక్కరి లైఫ్ లో ప్రేమించడం ఎంత కామనో , బ్రేకప్ కూడా అంతే కామన్. అలా బ్రేకప్ అయినా కుర్రాడు పాడే పాటే “టైం ఇవ్వు పిల్ల కొంచెం టైం ఇవ్వు” శ్రీమణి రచించిన ఈ పాటను తమిళ్ స్టార్ హీరో శింబు ఆలపించారు..ఇటీవల “టైం ఇవ్వు పిల్ల కొంచెం” అనే పాట హుక్ స్టెప్ ప్రోమోను రిలీజ్ చేసారు. గ్రాండ్ విజువల్స్ తో యూత్ కు బాగా కనెక్ట్ అయ్యింది.. అలానే ఈ పూర్తి పాటను తాజాగా విడుదలచేశారు..


ఎన్టీఆర్ బాద్ షా కి “డైమెండ్ గర్ల్” మంచు మనోజ్ పోటుగాడికి కి “బుజ్జి పిల్ల” యంగ్ హీరో రామ్ పోతినేని వారియర్ కి “బుల్లెట్ సాంగ్” ను పడిన శింబు ఇప్పుడు నిఖిల్ నటిస్తున్న 18పేజిస్ కోసం “టైం ఇవ్వు పిల్ల టైం ఇవ్వు” అనే పాటను పాడారు. వాటి మాదిరిగానే ఈ పాట కూడా పెద్ద హిట్ అవ్వబోతుందని అర్ధమవుతుంది. మంచి అంచనాలను నెలకొల్పిన ఈ చిత్రాన్ని క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 23 రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి..ఈ సినిమా హిట్ అయితే మాత్రం నిఖిల్ కెరీర్ దూసుకుపోతోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: