టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 1200 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేసిన ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో భారీ ఎత్తున పాజిటివ్ టాక్ అయితే దక్కించుకుంది.

అంతే కాకుండా సినిమా కి డిజిటల్ ప్లాట్ఫారం ద్వారా హాలీవుడ్ సినిమా రేంజ్ లో రెస్పాన్స్ కూడా దక్కింది. ఈ సినిమా ను ఆస్కార్ బరి లో నిలిపేందుకు చిత్ర యూనిట్ సభ్యులు తీవ్రంగా అయితే ప్రయత్నం చేస్తున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా యొక్క నామినేషన్ దాదాపుగా అయితే ఖరారు అయింది. వీఎఫ్ఎక్స్ కేటగిరిలో ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలువ బోతుంది అన్నట్లుగా అంతర్జాతీయ మీడియా సంస్థ ఒక కథనం లో కూడా పేర్కొంది.

విఎఫ్ఎక్స్ ఈ సినిమా లో చాలా అద్భుతంగా వచ్చాయి. అందుకే ఆస్కార్ కి నామినేట్ అయ్యే అవకాశం కన్ఫామ్ అన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఆస్కార్ కి నామినేట్ అయినా కూడా ఆస్కార్ రావడం అనేది చాలా కష్టం. ఎందుకంటే అవతార్ 2 తో పాటు పలు హాలీవుడ్ సినిమా లు కూడా విఎఫ్ఎక్స్ కి నామినేట్ అవుతాయి. కనుక ఆస్కార్స్ బరిలో ఆ సినిమా లను క్రాస్ చేసి మన సినిమా గెలవడం అనేది దాదాపుగా అసాధ్యమని చెప్పాలి.అయితే ఆస్కార్ కి నామినేట్ అవ్వడం కూడా ఎంతో గొప్ప విషయం. ఒక ఇండియన్ సినిమా అది కూడా తెలుగు లో రూపొందిన సినిమా.. ఆస్కార్ వరకు వెళ్లడం అనేది గొప్ప పురస్కారం.. అవార్డు. ముందు ముందు రాజమౌళి చేయబోతున్న సినిమా లు ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకోవాలని మనం కోరుకుందాం. ఈ సినిమా మాత్రం ఆస్కార్ కి నామినేట్ అయితే గొప్ప విషయం అన్నట్లుగా అందరం కూడా ఆశిద్దాం. ఆల్ ది బెస్ట్ టు టాలీవుడ్ దర్శక ధీర జక్కన్న రాజమౌళి.

మరింత సమాచారం తెలుసుకోండి: