విడుదల తేదీ దగ్గర కొస్తుండడంతో 'అవతార్ 2' సినిమా ఫీవర్ మొదలైపోయింది. డైరెక్టర్ జేమ్స్ కెమరూన్ అందించబోయే ఈ విజువల్ ఫీస్ట్ కోసం ఎంటైర్ వరల్డ్ మొత్తం ఎంతగానో ఎదురు చూస్తోంది.ఇక ఫస్ట్ పార్ట్ రేంజ్ లో ఈ మూవీ కూడా భారీ వసూళ్ళు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ 'అవతార్ 2' సినిమా రిలీజ్ కోసం ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. పదమూడేళ్ళ క్రితం రిలీజయి సెన్సేషన్ క్రియేట్ చేసిన అవతార్ సినిమా నుంచి రాబోయే సీక్వెల్స్ లో ఇది ఒకటి. ప్రకృతికి ఇంకా మానవుడి ఆక్రమణకు మధ్య జరిగే పోరాటంగా అవతార్ ఫస్ట్ పార్ట్ తెరకెక్కి అద్భుతమైన విజయం సాధించింది. జేమ్స్ కెమరూన్ అద్భుతమైన టేకింగ్ అయితే సినిమాకి మెయిన్ పిల్లర్ గా నిలిచింది. అయితే ఈ మూవీ సెకండ్ పార్ట్ నిజానికి ఎప్పుడో రిలీజవ్వాలి. అయితే అండర్‌వాటర్ పర్మార్మెన్స్ క్యాప్చర్ టెక్నాలజీని వాడటం వలన పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కావడంతో విడుదల వాయిదా పడుతూ వచ్చింది.'అవతార్ 2 ది వే ఆఫ్ వాటర్' సినిమా ఈ నెల 16న ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతోంది. తెలుగులో కూడా భారీ స్థాయిలో విడుదల కాబోతున్న అవతార్ 2 సినిమాకు ప్రసాద్ ఐమాక్స్ రెడీ అయింది.


అతి పెద్ద స్క్రీన్ లో సినిమాను ప్రదర్శించడానికి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో మూవీకి కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయింది. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ ఫస్ట్ పార్ట్ ను మించి ఉండబోతోందనే హింట్ కూడా ఇచ్చింది. విజువల్ గా వండర్స్ ను క్రియేట్ చేయబోతోందని స్పష్టంగా అర్ధమవుతోంది. దానికి తగ్గట్టుగానే రీసెంట్ గా వచ్చిన 'అవతార్ 2' సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూస్ కూడా సినిమా అద్బుతం అంటూ చెబుతున్నాయి.ఇక సెకండ్ పార్ట్ అనేది ఎమోషనల్ గా కూడా వండర్ అనిపించుకుంటుందని క్రిటిక్స్ అంటున్నారు.'అవతార్ 2' సినిమాను రీసెంట్ గా లండన్ లో లిమిటెడ్ మెంబర్స్ కు ప్రివ్యూ వేసి చూపించడం జరిగింది. ఇక చూసిన ప్రతీ ఒక్కరు కూడా సినిమా అద్బుతం అంటూ రివ్యూ చేశారు. 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' సినిమా టెక్నికల్ గా ఎంతో గొప్పది. ఫస్ట్ పార్ట్ కన్నా చాలా ఎమోషనల్ గా ఉంది. స్టోరీ, స్ర్కీన్ ప్లే, స్పిరిట్యువాలిటీ, బ్యూటీ, మూవీ మేకింగ్ ఇంకా అలాగే స్టోరీ టెల్లింగ్.. అన్నీ కూడా చాలా పెర్ఫెక్ట్ గా కుదిరి సినిమాని గొప్పగా తీర్చిదిద్దాయి అంటూ ఫేమస్ క్రిటిక్ ఎరిక్ డేవిస్ సినిమాపై తన అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. మరికొంత మంది కూడా సినిమాపై చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు.దాంతో సినిమాపై అంచనాలు బాగా పెరిగిపోతున్నాయి. మరి ఈ సినిమా నిజంగానే అంత పెద్ద అద్భుతమో కాదో తెలియాలంటే ఈ నెల 16 వ తేదీ వరకూ వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: