ఈ ఏడాదికి సంక్రాంతికి చాలా రసవంతంగా ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా సీనియర్ హీరోల సినిమాలు విడుదల కాబోతున్నాయి. చిరంజీవి,బాలకృష్ణ మధ్య బాక్సాఫీస్ పోరు చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. తెలుగు ప్రజలకు డబుల్ వినోదాన్ని ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. వీరిద్దరూ నటించిన సినిమాలు సంక్రాంతికి విడుదల కాబోతున్నాయి .ఇందులో ముఖ్యంగా బాలయ్య నటించబోతున్న వీరసింహారెడ్డి సినిమా డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. ఈ సినిమా మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించినట్లు సమాచారం .ఈ సినిమా జనవరి 12వ తేదీన విడుదల కాబోతోంది ఇందులో హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తోంది.


అలాగే దునియా విజయ్ ,వరలక్ష్మి శరత్ కుమార్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పలు అప్డేట్లు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మరొక భారీ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ట్రైలర్ విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధంగా ఉంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా అందుకు సంబంధించి ఒక భారీ ఈవెంట్ ను కూడా నిర్వహించబోతున్నట్లు సమాచారం. వీర సింహారెడ్డి సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ప్లేస్ ఫిక్స్ చేసినట్లుగా సమాచారం.


ఈనెల 6వ తేదీన ఒంగోలులో MBA కాలేజీలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నట్లు సమాచారం .ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా తెలియజేసింది మరొకవైపు అదే రోజు సాయంత్రం ఈవెంట్లో ట్రైలర్ను కూడా విడుదల చేయబోతున్నట్లు  ఈ విషయాన్ని సంగీత దర్శకుడు తమన్ లీక్ చేయడం జరిగింది. ఇప్పుడు వీరసింహారెడ్డి ట్రైలర్ కోసం అభిమానులే కాకుండా సినీ ప్రేక్షకులకు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతోంది నందమూరి బాలయ్య కెరియర్ మార్చేతుందా లేదా అనే విషయం కూడా ఈ సినిమా పైన ఆధారపడింది. జనవరి 6న ఫైర్ ఫైర్ ఫైర్ అని తమన్ ట్విట్ చేయడం జరిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: