నాచురల్ స్టార్ నానికి సినీ ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో పాపులారిటీ ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన మాస్ రోల్స్ కంటే ఎమోషనల్ , క్లాసీ రోల్స్ లో నటించినప్పుడు మంచి మంచి విజయాలు కూడా సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు క్లాసిక్ , మంచి లవ్ అండ్ ఎమోషన్స్ తో కూడిన కథతో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఎటువంటి పాత్రలో అయినా సరే సహజంగా నటిస్తారు కాబట్టి నానికి నాచురల్ స్టార్ అనే పేరు వచ్చింది. అందుకు తగ్గట్టుగానే ఆయన కూడా ఏ పాత్రలో నటించినా ఆ పాత్రకు పూర్తి న్యాయం చేస్తారనడంలో సందేహం లేదు.

ఇప్పటికే కీర్తి సురేష్ తో దసరా సినిమా చేస్తున్న ఈయన  తాజాగా .. సీతారామం హీరోయిన్  మృణాల్ ఠాకూర్ జంటగా ఒక సినిమాను రూపొందిస్తున్నారు. తెలుగులో ఆమె నటిస్తున్న రెండవ చిత్రం ఇది.. త్వరలో పూజా కార్యక్రమాలతో సినిమాను లాంచనంగా ప్రారంభించి.. ఆ మరునాడే సెట్స్ మీదకు తీసుకెళ్ళనున్నారు. జనవరి 31వ తేదీన అంటే మంగళవారం రోజున పూజా కార్యక్రమాలతో సినిమాను లాంచనంగా ప్రారంభించి.. ఆరోజు ఓపెనింగ్ జరిగితే మరుసటి రోజు అనగా ఫిబ్రవరి 1 బుధవారం నుంచి రెగ్యులర్గా షూటింగ్ మొదలు పెట్టనున్నారు.

శౌర్యువ్ దర్శకుడిగా పరిచయమవుతున్న తొలి చిత్రం కాగా వైరా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ వన్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.  చెరుకూరి వెంకట మోహన్,  డాక్టర్ విజయేందర్ రెడ్డి , తీగల మూర్తి కెవిఎస్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. నిజానికి న్యూ ఇయర్స్ సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు అయితే ఎప్పుడో షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది కానీ కొంచెం వాయిదా పడింది.. న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేసిన ఒక వీడియోలో.. ఒక నాని ఒక భవనం పైన కూర్చొని ఫోటోలు క్లిక్ చేస్తుండగా ఆయన పక్కన ఒక చిన్న అమ్మాయి కూర్చుని ఉన్నట్లు వాళ్ళిద్దరి మధ్య సంభాషణ వింటే సినిమాలో తండ్రి కూతుర్లుగా నటిస్తున్నారని మనకు ఈజీగా అర్థమవుతుంది.. ముఖ్యంగా వాళ్ళిద్దరి బాండింగ్ సినిమాలో హైలైట్ అయ్యేలా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: