
ఈ సినిమా కూడా ఫిబ్రవరి 17వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. మరో పక్క బాలీవుడ్ లో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ కోసం సిద్ధమవుతోంది.. ఇదిలా ఉండగా చాలా కాలం తర్వాత సోషల్ మీడియాలో మళ్లీ యాక్టివ్ అవుతోంది సమంత . వ్యక్తిగత జీవితంలో తాను ఎదుర్కొంటున్న సమస్యల గురించి కూడా ఆమె ప్రస్తావిస్తూ చేసిన పోస్ట్ పై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు.. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక పోస్టు అందరి దృష్టిని ఆకర్షించడమే కాదు మరింత ఎమోషనల్ చేసింది.
సమంత ఇప్పుడు ఫ్యామిలీ మెన్ మేకర్స్ నుంచి వస్తున్న సిటాడెల్ అనే ఒక వెబ్ సిరీస్ లో జాయిన్ కాబోతోంది. అందులో భాగంగానే తాజాగా సిటాడెల్ టీం తో సమావేశమైన ఫోటోతో పాటు మరికొన్ని ఫోటోలను కూడా ఆమె పోస్ట్ చేసింది.. ఇందులో.. సమంత.." చాలా గట్టిగా ఊపిరి పీల్చుకో పాప.. అన్ని త్వరలోనే చక్కబడతాయని నేను నీకు మాట ఇస్తున్నాను.. గడిచిన గత ఎనిమిది నెలలుగా నువ్వు అత్యంత ఇబ్బందికరమైన రోజులను చవి చూసావు.. వాటిని ఎప్పుడూ మర్చిపోవద్దు.. ముఖ్యంగా ఆ క్లిష్ట పరిస్థితులను నువ్వు ఎలా ఎదుర్కొన్నావో ఎప్పటికీ గుర్తుపెట్టుకో. ఆ సమయంలో ఏమైందో ఆలోచించడం మర్చిపోయావు.. దేని పైనా ఏకాగ్రత పెట్టలేకపోయావు.. సరిగా నడవలేక పోయావు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా నువ్వు ముందడుగు వేశావు.. నీ విషయంలో నేను చాలా గర్వంగా వున్నాను.. ధైర్యంగా ముందుకు సాగిపో అంటూ తనకు తానే చెబుతున్నట్లుగా సమంత ఈ పోస్ట్ చేసింది..