వరస పరాజయాలు తరువాత అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్’ తో హిట్ అందుకున్న ఆనందం ఎక్కువకాలం నిలబడలేదు. సురేంద్రరెడ్డి దర్శకత్వంలో అక్కినేని యంగ్ హీరో నటిస్తున్న ‘ఏజెంట్’ సినిమా ఈపాటికే విడుదల కావలసి ఉంది. అయితే రకరకాల కారణాలతో ఈ మూవీ విడుదల అనేకసార్లు వాయిదా పడి ఎట్టకేలకు తన రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్నప్పటికీ అఖిల్ కు అనుకోకుండా మణిరత్నం గండం ఎదురయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అని అంటున్నారు.


మొహమంతా రక్తం పూసుకుని అఖిల్ వార్నింగ్ ఇచ్చే వీడియో ఒకటి లేటెస్ట్ గా వదిలినప్పటికీ ఆవీడియోకు మిశ్రమ స్పందన రావడంతో ఈ మూవీ పై కొందరికి సందేహాలు ఏర్పడుతున్నాయి. ఈ మూవీని ఏప్రియల్ 29న విడుదల చేస్తున్నప్పటికీ ఈ మూవీకి గట్టిపోటీ ఏర్పైంది. మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్ 2’ అదే డేట్ ను టార్గెట్ చేస్తూ విడుదల కాబోతోంది.  వాస్తవానికి ఈ మూవీ ఫస్ట్ హాఫ్ తెలుగులో గొప్పగా విజయం సాధించనప్పటికీ ఈ మూవీ సీక్వెల్ తెలుగు రాష్ట్రాలలో కూడ హిట్ అయ్యే అవకాశం ఉంది అన్న అంచనాలు వస్తున్నాయి.  దీనికితోడు ఈ సినిమాను దిల్ రాజ్ తెలుగు రాష్ట్రాలలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న పరిస్థితులలో దిల్ రాజ్ గోల్డెన్ హ్యాండ్ కూడ ఈ మూవీ విజయానికి సహకరించే ఆస్కారం ఉంది అంటున్నారు.


అఖిల్ ‘ఏజెంట్’ మూవీని కూడ పాన్ ఇండియా స్థాయిలో అన్ని రాష్ట్రాలలోను విడుదల చేయబోతున్నారు. అయితే మణిరత్నానికి ఉన్న క్రేజ్ రీత్యా ఆమూవీకి తమిళనాడు కర్ణాటక కేరళా రాష్ట్రాలలో అఖిల్ ‘ఏజెంట్’ కంటే ఎక్కువ క్రేజ్ వచ్చే ఆస్కారం ఉంది. ఈ సంవత్సరం ఏప్రిల్ 29న వైష్ణవ్ తేజ్ సినిమా కూడ విడుదల కాబోతోంది.ఇప్పటికే ఈసినిమా మేకింగ్ కంటెంట్ గురించి ఇండస్ట్రీ వర్గాలలో వస్తున్న లీకులు చూస్తుంటే అఖిల్ కు వైష్ణవ్ తేజ్ నుండి కూడ గట్టి పోటీ ఎదురయ్యే ఆస్కారం ఉంది అంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: