నందమూరి బాలకృష్ణ లానే అసహనంగా ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడ తన కంట్రోల్ తప్పాడు. ఆశక్తిని కలిగించే సంఘటన లేటెస్ట్ గా జరిగిన విశ్వక్ సేన్ ‘ధంకీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జరిగింది. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా వచ్చిన తారక్ స్పీచ్ కి అడ్డు తగులుతూ అతడి అభిమానులు కొరటాల శివతో అతడు చేయబోతున్న మూవీ అప్ డేట్స్ గురించి అభిమానులు చేస్తున్న సందడి గమనించిన జూనియర్ కు అసహనం కలిగింది.


దీనితో కొద్దిగా తన స్వరం పెంచి ఇలా తన అభిమానులు ఆసినిమా అప్ డేట్స్ గురించి ప్రశ్నిస్తూ ఉంటే ఆమూవీ చేయడం ఆపేస్తాను అంటూ కొంచం గంభీరంగా సమాధానం ఇచ్చాడు. అయితే వెంటనే తన అన్నమాటకు అర్థాన్ని గ్రహించి తాను సినిమాలు చేయకుండా ఖాళీగా ఉంటే తన అభిమానులు ఊరుకోరుకదా అంటూ తన కోపాన్ని హాస్యంగా మార్చాడు. ఇది అంతా చూసినవారికి మాత్రం కొరటాల దర్శకత్వంలో జూనియర్ చేయవలసిన సినిమా ప్రారంభంకావడం రకరకాల కారణాలతో వాయిదా పడటం వలన అతడికి ఇలా అసహనం కలిగి ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


వాస్తవానికి ఈసినిమా క్రితం నెల ప్రారంభం కావలసి ఉంది. అయితే తారకరత్న మరణం కారణంగా ఈమూవీ ప్రారంభం వాయిదా వేసారు. ఆతరువాత జూనియర్ ఆస్కార్ అవార్డుల ఫంక్షన్ లో బిజీగా ఉండటంతో మరొకసారి ఈమూవీ ప్రారంభం వాయిదా వేసారు. ఈమూవీని పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్న పరిస్థితులలో ఈమూవీకి సంబంధించి హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను ఒప్పించడానికి చాల కష్టపడవలసి వచ్చింది అని అంటారు. దీనికితోడు ఈమూవీకి ఒక పవర్ ఫుల్ విలన్ ను అన్వేషించే ప్రక్రియలో కూడ చాలఆలస్యం జరిగింది అంటున్నారు.  


లేటెస్ట్ గా వస్తున్న వార్తల ప్రకారం బాలీవుడ్ హీరో సైఫ్ ఆలీ ఖాన్ ను ఈమూవీలో విలన్ గా ఎంపిక చేసారు అంటున్నారు. ఈమూవీ బాలీవుడ్ లో కూడ విడుదలవుతున్న పరిస్థితులలో ఈమూవీలోని పాటల ట్యూన్స్ విషయంలో చాల శ్రద్ధ తీసుకుంటున్నట్లు సమాచారం. తెలుస్తున్న సమాచారం వరకు ఈమూవీ ఈనెల 28న ప్రారంభోత్సవం జరుపుకుని అక్కడ నుండి చాలవేగంగా ఈమూవీ షూటింగ్ ను పూర్తిచేయాలని జూనియర్ చాల పట్టుదలగా ఉన్నాడు అని అంటున్నారు..
మరింత సమాచారం తెలుసుకోండి: