ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి అంచనాలు కలిగి ఉన్న మూవీ లలో దసరా సినిమా ఒకటి. నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఈ మూవీ తో శ్రీకాంత్ ఓదెల దర్శకుడుగా పరిచయం కాబోతున్నాడు. ఈ మూవీ కి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా ... కీర్తి సురేష్మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని మార్చి 30 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని తెలుగు తో పాటు హిందీ , కన్నడ , తమిళ , మలయాళ భాషల్లో ఒకే రోజు భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. 

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ప్రమోషన్ లను ఫుల్ స్పీడ్ లో నిర్వహిస్తోంది. అందులో భాగంగా నాని ప్రస్తుతం ఈ మూవీ యొక్క ప్రమోషన్ లను ఇండియా రేంజ్ లో నిర్వహిస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ బృందం సినిమా యొక్క ఐదు భాషల ట్రైలర్ లను లక్నో నుండి విడుదల చేసింది. ఈ ట్రైలర్ కు ప్రస్తుతం ఐదు భాషల ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ ను అధికారికంగా ప్రకటించింది.

తాజాగా ఈ సినిమా యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. సెన్సార్ బోర్డు నుండి ఈ సినిమాకు యు / ఏ సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం అధికారికంగా ఒక పోస్టర్ విడుదల చేసి ప్రకటించింది. అలాగే ఈ మూవీ 2 గంటల 36 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండగా ... మిగతా రాష్ట్రాల్లో కూడా మంచి అంచనాలు నిలకొని ఉన్నాయి. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయం అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: