అక్కినేని అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ అనే పక్కా మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కి స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... సాక్షి వైద్య ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. హిప్ హాప్ తమిజ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇది వరకే ఈ సంగీత దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ధ్రువ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ మ్యూజిక్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

 దానితో ఏజెంట్ మూవీ మ్యూజిక్ పై కూడా ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇలా భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమా నుండి ఇప్పటికే చిత్ర బృందం రెండు పాటలను విడుదల చేసింది. అందులో మొదటి పాటకు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుండి చిత్ర బృందం సెకండ్ సింగిల్ ను విడుదల చేసింది. ఈ సాంగ్ కూడా ప్రేక్షకుల నుండి ప్రస్తుతం అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తుంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థ వారు నిర్మిస్తున్నారు. ఈ మూవీ లో మమ్ముట్టి ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 28 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాను తెలుగు తో పాటు కన్నడ , మలయాళ , హిందీ , తమిళ్ భాషలో కూడా ఒకే రోజు విడుదల చేయనున్నారు. అఖిల్ తన కెరియర్ లో నటిస్తున్న మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ మూవీ పై అక్కినేని అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికుల్లో కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: