తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరో లలో నితిన్ ఒకరు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో విజయవంత మైన మూవీ లలో హీరో గా నటించిన నితిన్ ఇప్పటికీ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే నితిన్ కెరియర్ లో మంచి విజయం సాధించిన మోవీ లలో ఇష్క్ మూవీ ఒకటి. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో నిత్యా మీనన్ హీరోయిన్ గా నటించగా ... అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. పెద్దగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ సినిమా అప్పట్లో భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని ... అద్భుతమైన కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఈ మూవీ తో నితిన్ కు ... నిత్యా మీనన్ కు ... విక్రమ్ కే కుమార్ కు అనుప్ రూబెన్స్ కు అద్భుతమైన గుర్తింపు కూడా లభించింది.

ఇలా ఆ సమయం లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని ఎంతో మంది.కి గొప్ప పేరుని తీసుకువచ్చిన ఇష్క్ సినిమాను తిరిగి థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం నితిన్ పుట్టిన రోజు సందర్భంగా ఇష్క్ మూవీ ని మార్చి 29 వ తేదీన థియేటర్ లలో రీ రిలీజ్ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా  విడుదల కాబోతోంది. మరి ఆ రోజుల్లో అద్భుతమైన విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్ లను వసూలు చేసి ఎంతో మంది కి మంచి గుర్తింపును తీసుకువచ్చిన ఇష్క్ సినిమా రీ రిలీజ్ లో భాగంగా ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: