ఏప్రియల్ 14న విడుదల కాబోతున్న ‘శాకుంతలం’ మూవీ ప్రమోషన్ ను సమంత రెండు వారాలు ముందే మొదలు పెట్టింది. గత కొంతకాలంగా తన ఆరోగ్యం పై వస్తున్న వార్తలకు సమాధానంగా ఈ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాల పై స్పందించింది. జీవితంలో ఎదగాలి అంటే ఏవిషయం అయితే భయపెడుతుందో ఆ భయపెట్టే విషయం పై పోరాటం చేసినప్పుడే విజయం వస్తుంది అని కామెంట్స్ చేసింది.


ముందుగా ‘శకుంతల’ కథ విన్నప్పుడు తనకు ఆకథలో నటించడానికి చాల భయం అనిపించిందని అలాంటి పాత్రను తాను చేయలేను అన్నభయం తనను వెంటాడిందని సమంత కామెంట్ చేసింది. అయితే చాల ఆలోచించిన తరువాత తాను ఒక నియమం పెట్టుకున్న విషయాన్ని వివరించింది. ‘నాకు భయమేసిందంటే ముందు దాన్ని పూర్తి చేసేయాల్సిందే. ఆభయాన్ని దాటాలని నిర్ణయించుకున్నాను. ఏ అంశమైతే భయపెడుతుందో దాన్ని ఎదుర్కోవడం మొదలుపెట్టాను. అలా మూడేళ్లలో వ్యక్తిగతంగా సినిమాల పరంగా నాలో వచ్చిన మార్పునకు ధైర్యంగా భయంతో నేను చేసిన పోరాటమే కారణం’ అంటూ తన సక్సస్ సీక్రెట్ వివరించింది.


అయితే ఇప్పటికీ తనను కొన్ని భయాలు వెంటాడుతున్నాయని ఆ భయాలతో అనునిత్యం పోరాటం చేయడమే తన పనిగా మార్చుకున్న విషయాన్ని వివరించింది. శకుంతల పాత్ర కోసం తాను శారీరకంగా పెద్దగా కష్టపడనప్పటికీ మానసికంగా ఆపాత్ర కోసం తాను చాల కష్ట పడ్డాను అని అంటోంది.  శకుంతల పాత్ర అత్యంత స్వచ్ఛమైనది అని చెపుతూ ఆపాత్రలోని నిజాయితీ తనకు  ఎంతో నచ్చింది అని అంటోంది.


సాధారణంగా హీరోయిన్ ఒరియేంటెడ్ సినిమాలకు భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రావు అయితే ప్రస్తుతం భారీ బడ్జెట్ తో తీసిన ‘శాకుంతలం’ మూవీ కనీసం బ్రేక్ ఈవెన్ కు రావాలి అంటే ఈమూవీకి మొదటి మూడు రోజులు వచ్చే కలక్షన్స్ అత్యంత కీలకంగా మారాయి. ప్రస్తుతం సినిమాలు చూస్తున్నది యువతరం మాత్రమే కావడంతో వారిని ఎంతవరకు ఈమూవీ తన ధియేటర్ల వరకు రప్పించుకోగలుగుతుంది అన్నది ప్రశ్న..మరింత సమాచారం తెలుసుకోండి: