శ్రీరాముడి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాలి అంటే సాధారణమైన పనికాదు. తెలుగువారికి శ్రీరాముడు పేరు వినగానే వెంటనే నందమూరి తారకరామారావు గుర్తుకు వస్తారు. ఇలాంటి పరిస్థితులలో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటిస్తున్న ‘ఆదిపురుష్’ ఒక సాహసం. అందరికీ బాగా తెలిసిన రామాయణాన్ని మళ్ళీ సినిమాగా తీసి మెప్పించాలి అంటే చాల జాగ్రత్తలు తీసుకోవాలి.


అయితే 500 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రభాస్ నటిస్తున్న ‘ఆదిపురుష్’ మూవీ సమ్మర్ సీజన్ ముగిసిన వెంటనే రాబోతోంది. లేటెస్ట్ గా శ్రీరామనవమి సందర్భంగా విడుదలైన ఈమూవీ పోష్టర్ పై మళ్ళీ విమర్శలు మొదలయ్యాయి. ఈ పోష్టర్ లో శ్రీరాముడి పాత్రలో నటిస్తున్న ప్రభాస్ కు కిరీటం కనిపించలేదు. ఇక రాముడు పక్కన సీత పాత్రలో నటిస్తున్న కీర్తి సనన్ మొఖం లో పవిత్రత కనిపించకపోవడంతో పాటు చీర పైన షాలువా కప్పుకుని ఉన్నట్లు కనిపిస్తోంది ఏమిటి అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు.


ఇదే పోష్టర్ లో కనిపించిన లక్షణుడు పాత్రకు సంబంధించిన లుక్ లో శ్రీరాముడు పట్ల విధేయత కంటే అతడి కళ్ళల్లో రౌద్రం కనిపిస్తోంది అని మరికొందరు జోక్ చేస్తున్నారు. ఇప్పటికే ఆమధ్య విడుదలైన టీజర్ కు విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ రావడంతో ఈ సంవత్సరం ప్రారంభంలో సంక్రాంతికి రావలసిన ఈమూవీ విడుదలను వాయిదా వేసి ఈమూవీ గ్రాఫిక్స్ వర్క్స్ పై మళ్ళీ దృష్టి పెట్టారు.


అయితే ఇప్పుడు ఈమూవీ జూలైలో విడుదలవుతున్న పరిస్థితులలో మళ్ళీ జనంలో క్రేజ్ ను పెంచడానికి వ్యూహాత్మకంగా ఈమూవీకి సంబంధించిన పోష్టర్ ను విడుదల చేసారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ పోష్టర్ పై కూడ నెగిటివ్ ట్రోలింగ్ మొదలు కావడంతో ఇప్పటికే రెండు వరస ఫ్లాప్ లు అందుకున్న ప్రభాస్ కు మళ్ళీ ‘ఆదిపురుష్’ ఒక పీడకల లా మారుతుందా అన్న సందేహాలు ప్రభాస్ అభిమానులకు మొదలు కావడంతో ఈ విషయాలు పరోక్షంగా ప్రభాస్ కు తెలియడంతో అతడు బయటకు కనపడని టెన్షన్ లో ఉన్నట్లు టాక్..
మరింత సమాచారం తెలుసుకోండి: