పవన్ కళ్యాణ్ "భీమ్లా నాయక్" మూవీ తో దాదాపు సమానం గా హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ ను ప్రారంభించాడు . ఇప్పటికే భీమ్లా నాయక్ మూవీ విడుదల అయ్యి చాలా కాలం అవుతుంది. కానీ హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ ఇప్పటి వరకు పూర్తి కాలేదు. మధ్యలో కొన్ని రోజుల పాటు నిలిచిపోయిన హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ తిరిగి కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది. అలాగే ఈ మూవీ షూటింగ్ కూడా ఇప్పటికే చాలా భాగం పూర్తయింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన కేవలం కొద్ది భాగం షూటింగ్ మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది .


ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల 11 వ తేదీ నుండి ఈ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది . త్వరలో ప్రారంభం కాబోయే ఈ తాజా షెడ్యూల్లో ఈ చిత్ర బృందం క్లైమాక్స్ ముందు వచ్చే సన్నివేశాల చిత్రీకరణ చేయబోతున్నట్లు తెలుస్తోంది . ఈ సన్నివేశాలలో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి కనిపించబోతున్నట్లు సమాచారం .

 అలాగే ఈ సన్నివేశాలను అత్యంత భారీ బడ్జెట్ తో ... చాలా గ్రాండ్ గా రూపొందించ బోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది . ఎం ఎం కీరవాణిమూవీ కి సంగీతం అందిస్తున్నాడు . పవన్ మరియు క్రిష్ లకు ఇదే మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ లో పవన్ పై భారీ యాక్షన్ సన్నివేశాలు చాలానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: