దాంతో ఈ సినిమా మీద ఫ్యాన్స్ లో విపరీతమై న అంచనాలు అయితే పెరిగిపోయాయి.పవన్ కళ్యాణ్ సినిమా సంభందించిన ఏ ఒక్క చిన్న అప్డేట్ వచ్చిన కూడా ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతారు.
ఈ రెండు సినిమాల్లో బిజీ గా ఉంటూనే మరో పక్క డైరెక్టర్ సుజీత్ తో చేస్తున్న ఓజీ సినిమాని కూడా తొందరగా సెట్స్ మీద కి తీసుకెళ్ళి ప్రయత్నం కూడా చేస్తున్నారటా పవన్ కళ్యాణ్. ఈ సినిమా మీద కూడా జనాల్లో మంచి అంచనాలు అయితే ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెస్ట్ లేకుండా షూటింగ్స్ లో పాల్గొంటున్నట్లు సమాచారం.ఎందుకంటే వచ్చే ఏడాది సమ్మర్ లో ఎలక్షన్స్ ఉండటం తో ఇప్పుడు తొందర గా సినిమాలు కంప్లీట్ చేసుకొని ఎలక్షన్స్ కంపైన్ చేయాలని చూస్తున్నట్టు గా సమాచారం.. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేస్తున్న మూడు సినిమాల మీద కూడా ఫ్యాన్స్ తో పాటు సిని అభిమానుల్లో కూడా మంచి క్రేజ్ ఉంది అనే చెప్పాలి.ఇక ఏది ఏమైనప్పటికీ ఈ మూడు సినిమాలని వీలైనంత తొందరగా తీసి విజయం సాధించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇది ఇలా ఉంటే అటు రాజకీయం లో రోజుకో చర్చ అయితే నడుస్తోంది.కానీ పవన్ కళ్యాణ్ మాత్రం నిజం గా రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ చాలా బాగా ముందుకు వెళ్తున్నారు అనే చెప్పవచ్చు..మరి రెండిటిని ఒకే పంథా లో తీసుకెళ్తారా లేదా దేనికి అయిన బ్రేక్ ఇస్తారేమో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి