
ఈసినిమాను చూసిన ప్రేక్షకులు చాలామంది ఎక్కువగా ఇప్పుడు ఆమూవీలో నటించిన త్రిష గురించి మాట్లాడుకుంటున్నారు. గతంలో త్రిష టాప్ యంగ్ హీరోలందరితోను నటించిన ట్రాక్ రికార్డు ఉంది. అయితే అనేకమంది యంగ్ హీరోయిన్స్ రావడంతో మన టాప్ యంగ్ హీరోలు త్రిషను పక్కకు పెట్టారు. ‘పొన్నియన్ సెల్వన్-2 లో నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ విక్రమ్ ఉన్నాడు. ఒకప్పటి ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ కూడ ఉంది.
అయితే వీరిద్దరి గురించి పట్టించుకోకుండా సగటు ప్రేక్షకుడు త్రిష కార్తి ల గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నారు. కార్తి ఎప్పటిలాగే చాల యాక్టివ్ గా ఈసినిమాలో నటిస్తే త్రిష మాత్రం 40 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ ఆమె మొఖంలో గ్లామర్ తగ్గకుండా రాణి పాత్రలో చాల హుందాగా నటిస్తూనే గ్లామర్ ఒలకపోసింది. ఈసినిమాను చూసిన కొందరు త్రిష తన కెరియర్ బిగినింగ్ లో కూడ ఇంత అందంగా కనిపించలేదు అని కామెంట్స్ చేస్తున్నారంటే మణిరత్నం ఆమెపట్ల తీసుకున్న శ్రద్ధ అర్థం అవుతుంది.
ముఖ్యంగా ఈసినిమాలో కార్తి త్రిష లు ఒక నీటి మడుగు మధ్యలో వచ్చే సీన్ లో నటించిన నటనకు వారి హావభావాలకు చాలమంచి మార్కులు పడుతున్నాయి. ఈమూవీలో పాత్రల చిత్రీకరణ విషయంలో మణిరత్నం చూపించిన శ్రద్ధ రాజమౌళి లాంటి గొప్ప దర్శకులకు కూడ ఒక పాఠం లా మారుతుంది అంటూ కొందరు విశ్లేషకులు చేస్తున్న కామెంట్స్ మణిరత్నం ఏకాగ్రతను అదేవిధంగా అతడి సమర్థతను సూచిస్తున్నాయి. ఈమూవీలో త్రిష కు వచ్చిన క్రేజ్ రీత్యా మళ్ళీ మన టాప్ హీరోల పక్కన ఆమె నటించే అవకాశాలు ఉన్నా ఆశ్చర్యం లేదు అంటున్నారు..