కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఎంతో అట్టహాసం గా కొనసాగింది. చివరి రోజున బాలీవుడ్‌ స్టార్‌ నటి అనుష్క శర్మ సందడి చేశారు. వైట్‌ డ్రెస్‌లో రెడ్‌ కార్పెట్‌పై దేవకన్య లా మెరిసారు...ఫ్రాన్స్‌ వేదికగా కొనసాగిన 76వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ గ్రాండ్‌గా అయితే ముగిసింది.

కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ లో ప్రపంచవ్యాప్తం గా ప్రజాదరణ పొందిన సినీ తారలు, మోడళ్లు, డిజైనర్లు, పలువురు సెలబ్రిటీలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. విభిన్న ఫ్యాషన్‌ దుస్తుల్లో రెడ్‌ కార్పెట్‌పై హొయలు పోయారు ముద్దుగుమ్మలు. రకరకాల డ్రెస్సుల తో బాగా అదరగొట్టారు. స్టేజ్‌పై ఫోజులిస్తూ బాగా అలరించారు. అంగరంగ వైభవం గా వివిధ దేశాల తారలు, నటీనటులు, టెక్నీషియన్స్, డిజైనర్లు, మోడళ్ల తో కేన్స్‌ కిటకిటలాడి పోయింది..

కేన్స్‌ 2023 ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 16న ప్రారంభం కాగా.. భారత్‌ నుంచి పలువురు తారలు విభిన్న దుస్తుల్లో రెడ్‌ కార్పెట్‌పై మెరిసారటా.. చివరి రోజున బాలీవుడ్‌ స్టార్‌ నటి అనుష్క శర్మ పాల్గొని బాగా సందడి చేశారు. ఫ్లవర్‌ షేప్‌లో ఉన్న వైట్‌ డ్రెస్‌ లో రెడ్‌ కార్పెట్‌పై హొయలు పోతూ ఫొటోలకు ఫోజులిచ్చారని తెలుస్తుంది..

దీనికి సంబంధించి న ఫొటోలు ప్రస్తుతం తెగ వైరల్‌ అవుతున్నాయి. ఇక.. కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు ఇప్పటి వరకు బాలీవుడ్ హీరోయిన్లు చాలా మంది అయితే వెళ్లారు. కానీ.. అనుష్క శర్మకు మాత్రం ఇది ఫస్ట్ కేన్స్ వేడుక. ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఈ బ్యూటీ కేన్స్‌ కు వెళ్ళలేదు. దాంతో 76వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అనుష్కశర్మ కు ఎంతో స్పెషల్‌ గా మారింది.తన అందంతో ఎంతో మందిని తన ఫ్యాన్స్ గా మార్చుకుంది అనుష్క. తన లుక్స్ తో అందరిని మైమరిపించింది అనుష్క. విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకొని ఒక పాపకు జన్మ ఇచ్చిన అనుష్క సినిమాలకు దూరంగా ఉందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: